breaking news
on 16th
-
16న అమరావతికి కలెక్టర్
అనంతపురం అర్బన్ : జిల్లా కలెక్టర్లతో ఈ నెల 17,18 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు హారయ్యేందుకు కలెక్టర్ జి.వీరపాండియన్ ఈ నెల 16న అమరావతికి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం నేపథ్యంలో ముఖ్యమంత్రి కలెక్టర్లతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసుకునే ప్రక్రియలో కలెక్టర్ బిజీగా ఉన్నారు. -
16నుంచి జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన
అనంతపురం అర్బన్ : రాష్ట్ర బీసీ కమిషన్ ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనుందని డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ కె.ఎల్.మంజునాథ్ సార థ్యంలో సభ్యులు 16వ తేదీ సాయంత్రం 6.30 జిల్లాకు చేరుకుని స్టేట్ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారని తెలిపారు. 17వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి 10.15 వరకు కలెక్టర్, ఎస్పీలతో కుల ద్రువీకరణ పత్రాలు, క్రిమిలేయర్, ప్రజా సాధికార సర్వే అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. 10.30 నుంచి లలిత కళాపరిషత్‌లో రాష్ట్ర బీసీ జాబితాలో చేర్పులు, మార్పులపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారన్నారు. 18వ తేదీ ఉదయం 10.30 గంటలకు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. అనంతరం కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.