Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Kejriwal Appeals for Public Support for his family He Returns to Jail
ఎల్లుండి లొంగిపోతున్నా.. మీరంతా జాగ్రత్త: సీఎం కేజ్రీవాల్‌

ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంత బెయిల్‌ గడువు ఎల్లుండి (ఆదివారం)తో ముగుస్తుంది. ఆరోజే కేజ్రీవాల్‌ తిరిగి తీహార్ జైలులో లొంగిపోనున్నారు.సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తాను లొంగిపోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రజలకు తెలియజేశారు.ఈ క్రమంలో తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొగసాగుతుందని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ లోక్ సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు నాకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండి నేను తీహార్ జైలులో లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తెలీదు. దేశాన్ని నిరకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్ళేందుకు జైలుకి వెళ్తున్నాను. నన్ను మాట్లాడనియకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు.मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024 నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నా. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను. జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు. నా షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు ఏం కోరుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. ఆరు కేజీల బరువు తగ్గాను. జైలుకు వెళ్ళినపుడు 70 కేజీల ఉన్నాను. ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర వైద్య సమస్యలు ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్‌లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎల్లుండి మూడు గంటలకు నేను తీహార్ జైలులో లొంగిపోతాను. నేను దేనికి వెనక్కి తగ్గను. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జైలులో నా చింత అంతా ఢిల్లీ ప్రజల గురించే. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా ఢిల్లీ ప్రజల అన్ని పనులు జరుగుతాయి. జైలులో లోపల ఉన్నా బయట ఉన్నా ఢిల్లీ ప్రజల పనులు ఆగవు. ఉచిత విద్యుత్, మోహల్లా క్లినిక్, హాస్పిటళ్లలో వైద్యం, ఉచితంగా మందులు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, 24 గంటల కరెంట్ సహా త్వరలో మహిళలకు రూ. వెయ్యి ఆర్థిక సహకారం కొసాగుతుంది. ఢిల్లీ ప్రజల కుటుంబ సభ్యుడిలా నా బాధ్యత నెరవేర్చా. నా తల్లిదండ్రుల కోసం దేవుడిని ప్రార్ధించండి. వారి ఆరోగ్యం బాగాలేదు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలి ’’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

SIT issues notice to Bhavani Revanna over Molestation Abuse accused Prajwal
కర్ణాటకలో కొత్త ట్విస్ట్‌.. ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణకు సిట్‌ నోటీసులు

బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తల్లికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(A), 365, 109, 120(B) కింద సిట్‌ నోటీసులు ఇచ్చింది. తమ విచారణ కోసం భావానీ రేవణ్ణ హోలెనర్సీపూర్‌లోని వారి నివాసంలోనే జూన్‌ 1న సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్‌ పేర్కొంది. #BreakingS.I.T issues another notice to #PrajwalRevanna's mother #BhavaniRevanna in the kidnapping case.Prajwal Revanna will shortly be taken for a medical examination, and after that, he will be brought to the City Civil Court Complex for further questioning...: @dpkBopanna… pic.twitter.com/G9croxFBP6— TIMES NOW (@TimesNow) May 31, 2024 ఇక.. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి భారత్‌కు వచ్చిన ప్రజ్వల్‌ రేవణ్ణను సిట్‌ పోలీసులు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక.. అక్కడి నుంచి ఆయన్ను విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా ప్రజ్వల్‌కు పొటెన్సీ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

AP Elections 2024: May 31th Political Updates In Telugu
May 31th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 31th AP Elections 2024 News Political Updates..3:00 PM, May 31st, 2024ఏపీ ఎన్నికల ఫస్ట్ రిజల్ట్ ఎక్కడ?గోదావరి జిల్లాల నుంచే మొదటి ఫలితం వెలువడుతుందా?గోదారోళ్లు ఎవరికి మద్దతిచ్చారో మధ్యాహ్నానికి క్లారిటీ13 రౌండ్లలో నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుఈ రెండింటిలో ఏదో ఒకటి తొలి ఫలితం అంటున్న అధికారులు14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనున్న ఆచంట, పాలకొల్లు15 రౌండ్లలో పెద్దాపురం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, మచిలీపట్నం, బాపట్ల నియోజకవర్గాలుతొలి మూడు గంటల్లోనే దాదాపు గోదావరి జిల్లాలలోని ఎనిమిది నియోజకవర్గ ఫలితాలుచిట్టచివరగా రంపచోడవరం, చంద్రగిరి ఫలితాలుఈ రెండు చోట్ల 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపుభీమిలి, పాణ్యం నియోజకవర్గాలలోనూ ఫలితాలు రాత్రికి వచ్చే అవకాశంఈ రెండింటిలో 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపుపులివెందుల, కుప్పం ఫలితాలకి సాయంత్రం వరకు వేచి చూడాల్సిందేమధ్యాహ్నానికే పిఠాపురం ఫలితాలు2:00 PM, May 31st, 2024ప్రజలకు, జగనన్నకి మధ్య ఉన్న బంధం ఎవరూ చెరిపేయలేనిది.. పెత్తందారులకి ఎప్పటికీ అర్థంకానిదిప్రజలకు, జగనన్నకి మధ్య ఉన్న బంధం ఎవరూ చెరిపేయలేనిది.. పెత్తందారులకి ఎప్పటికీ అర్థంకానిది.జూన్ 4 తర్వాత ఈ బంధం మరింత పదిలం అవడం ఖాయం!#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/odwMSfKonS— YSR Congress Party (@YSRCParty) May 31, 2024 12:30 PM, May 31st, 2024ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై వేటు..అమరావతి...ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటుపి. శ్రీలేఖపై ఒంగోలు పార్లమెంటు, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బదిలీఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిప్యూటీ కలెక్టర్ కర్నూల్ ఏ.మురళి, డిప్యూటీ కలెక్టర్ అనంతపూర్ ఓ.రాంభూపాల్ రెడ్డి బదిలీ ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తదుపరి ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని ఆదేశంఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్‌ కేఎస్‌ జవహర్ రెడ్డిబదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జవహర్ రెడ్డివీరు ఆయా స్ధానాల్లో ఆర్వోలుగా ఎంసీసీ పూర్తయ్యే వరకూ వ్యవహరించనున్నట్టు సమాచారంఎం.వెంకట సత్యనారాయణను మార్కాపూర్ ఆర్ అండ్ ఆర్ యూనిట్‌కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీసి.విశ్వనాధ్‌ను కర్నూల్ హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ త్రీకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీజే.శిరీషను అనంతపురం పిఏబిఆర్-2కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ 11:45 AM, May 31st, 2024ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా?మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నల వర్షం..ఏపీలో ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా?దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీలో మాత్రమే ఈసీ అమలు చేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటుపై వైఎస్సార్‌సీపీ హైకోర్టుకి వెళ్లగానే.. హడావుడిగా నిర్ణయాన్ని ఈసీ వెనక్కి తీసుకుంది.అంటే ఈసీ తప్పు చేసినట్లేగా? ఏపీలో ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా? దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీలో మాత్రమే ఈసీ అమలు చేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటుపై వైయస్‌ఆర్‌సీపీ హైకోర్టుకి వెళ్లగానే.. హడావుడిగా నిర్ణయాన్ని ఈసీ వెనక్కి తీసుకుందంటే తప్పు చేసినట్లేగా?-మాజీ… pic.twitter.com/cVFjx2N25M— YSR Congress Party (@YSRCParty) May 31, 2024 11:00 AM, May 31st, 2024ఫిరాయింపు ఎమ్మెల్సీ రఘురామ కొత్త డ్రామా.. విశాఖ ఆసుపత్రిలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్సీ రఘురామఈరోజు మండలి ఛైర్మన్‌ ఎదుట హాజరుకావాల్సిన రఘురామ. విచారణ నుంచి తప్పించకోవడానికి రఘురామ ఎత్తుగడ. 10:15 AM, May 31st, 2024అల్లరి మూకలకు పల్నాడు ఎస్పీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌పల్నాడులో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదురాజకీయ నేతల కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తాం. ఒక్కసారి రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తే మీ జీవితం నాశనం అయినట్టే. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం. పల్నాడు జిల్లా పేరు చెబితే దేశం ఉలిక్కి పడేలా చేశారు. 9:40 AM, May 31st, 2024పచ్చ బ్యాచ్‌ ఫేక్‌ బతుకు బట్టబయలు..టీడీపీ ఫేక్ బతుకు మళ్లీ బట్టబయలు!చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఎల్లో మీడియాని మించి కూటమి కోసం భజన చేస్తున్న 9ఐమీడియాసీపీఎస్‌తో కలిసి పోస్ట్ పోల్ సర్వే చేసినట్లు 9ఐమీడియా తప్పుడు ప్రచారం.కానీ తాము ఎవరితో కలిసి సర్వే చేయలేదని ఆ ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎస్గతంలోనూ ఇలాంటి ఫేక్ సర్వేలతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీటీడీపీది ఫేక్‌ బతుకంటూ ప్రజల ఆగ్రహం. టీడీపీ ఫేక్ బతుకు మళ్లీ బట్టబయలు!చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఎల్లో మీడియాని మించి కూటమి కోసం భజన చేస్తున్న 9ఐమీడియాసీపీఎస్‌తో కలిసి పోస్ట్ పోల్ సర్వే చేసినట్లు 9ఐమీడియా తప్పుడు ప్రచారం.. కానీ తాము ఎవరితో కలిసి సర్వే చేయలేదని ఆ ఛానల్‌పై ఉమ్మేసిన సీపీఎస్గతంలోనూ ఇలాంటి ఫేక్… https://t.co/2S5r92PmK1— YSR Congress Party (@YSRCParty) May 30, 2024 9:00 AM, May 31st, 2024స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతను పరిశీలించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌తిరుపతి జిల్లా..అర్థరాత్రి శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుహర్షవర్ధన్ రాజు కామెంట్స్..స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని వైపులా తనిఖీలు.కేంద్ర సాయుధ బలగాల ఆధీనంలో స్ట్రాంగ్ రూమ్ చాలా భద్రంగా ఉంది.ఔటర్ కార్డెన్‌లో మూడు మొబైల్ పార్టీస్‌తో నిరంతర పహారా కొనసాగుతోంది.స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఎవరూ సందేహపడాల్సిన పనిలేదు.స్ట్రాంగ్ రూమ్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ జరుగుతోంది.. లోపలికి ఎవరూ రాలేరు. 8:40 AM, May 31st, 2024తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌అనంతపురం..తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ శిరీషా నియామకంఇప్పటిదాకా ఆర్వోగా విధులు నిర్వహించిన రాంభూపాల్ రెడ్డికాగా, రాంభూపాల్‌ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో శిరీషను నియమించిన ఎన్నికల సంఘం 8:00 AM, May 31st, 2024ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరటవైఎస్సార్‌ జిల్లా..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరటచాపాడులో ఎన్నికల రోజు జరిగిన ఘటనల్లో కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యేపై నమోదైన కేసుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఓకే చెప్పిన కోర్టు.ఈనెల ఆరో తేదీ వరకు పలు షరతులతో మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరుఅరెస్టుతో సహా, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చాపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశం 7:45 AM, May 31st, 2024విశాఖలో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌..విశాఖపట్నం.. పీఎం పాలెం..ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్నగరంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు.సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం.రౌడీ షీటర్స్ కదలికలపై పోలీసుల నిఘా వేసిన డీసీపీ లక్ష్మీ నారాయణ.జూన్ నాలుగో కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు నగరంలో పలు సమస్యత్మాక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి.కార్డన్ సెర్చ్‌లో నార్త్ ఏసీపీ సునీల్, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు సునీత, సురేష్, సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు. 7:30 AM, May 31st, 2024పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటంకేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో మెమోలపై పిటిషన్‌ అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఓ మెమోలో కొంత భాగం.. మరో మెమోను పూర్తిగా ఉపసంహరణ సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ ఆమోదం ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు హైకోర్టుకు సీఈసీ నివేదన.. వైఎస్సార్‌సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టుఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సవరణ పిటిషన్‌ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ.. ఈ పిటిషన్‌లో అభ్యర్థనను సవరించాలన్న ధర్మాసనం 7:00 AM, May 31st, 2024స్వతంత్రుల ఏజెంట్లూ ‘తమ్ముళ్లే’! ఆ మేరకు టీడీపీ బేరసారాలు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లు ఉండేలా ఎత్తుగడఅవసరమైతే గొడవలు చేసేందుకు సిద్ధంగా ఉండేలా వ్యూహం

'Gangs Of Godavari' Movie Review And Rating In Telugu
గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ రివ్యూ

టైటిల్‌: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరినటీనటులు: విశ్వక్‌ సేన్‌, అంజలి, నేహా శెట్టి, నాజర్‌, హైపర్‌ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్‌ శంకర్‌ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్‌ మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్‌ అలియాస్‌ రత్న(విశ్వక్‌ సేన్‌) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్‌) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్‌ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్‌ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్‌ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్‌ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్‌ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్‌ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్‌ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్‌ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్‌తో హీరో క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్‌ రత్నాకర్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్‌ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్‌ఫుల్‌ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్‌ సాంగ్‌లో ఆయేషా ఖాన్‌ అందాలతో ఆకట్టుకుంది. విలన్‌గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్‌, సాయి కుమార్‌ హైపర్‌ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్‌ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Naveen Patnaik responds on VK Pandian controlling BJD allegations
ఒడిశాలొ ‘పాండియన్‌’ పాలిటిక్స్‌.. నవీన్‌ పట్నాయక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భువనేశ్వర్‌: బీజేడీ నేత వీకే పాండియన్ వ్యవహారం ‌ఒడిశా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒడిశా సీఎంను పాండియన్‌ నియంత్రిస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు సీఎం నవీన్‌ పట్నాయక్‌కు పాండియన్‌ రాజకీయ వారసుడంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేడీ చీఫ్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గురువారం స్పందించారు.ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా నవీన్‌ పట్నాయక్‌.. ‘‘ నా వారసుడి విషయంలో ఇదివరకే చాలా క్లారిటీగా చెప్పాను. నా వారసుడిని ఒడిశా రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటివి చాలా సహజంగా ప్రజల ద్వారానే జరిగిపోయే విషయాలు. ప్రజస్వామ్యంలో పార్టీల్లో నేతలు వివిధ పదువుల్లో ఉంటారు. మంత్రులుగా ప్రజల ప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా అధికారాలను కలిగి ఉంటారు. పాండియన్‌ ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.#WATCH | On being asked about "putting VK Pandian above other BJD leaders", Odisha CM Naveen Patnaik says "I find all of this quite nonsensical..."On VK Pandian, he further says "Party members have a great say, they have high positions, they are ministers, they are the people's… pic.twitter.com/XigUlX4wS1— ANI (@ANI) May 30, 2024 ఇక.. వీకే పాండియన్‌ నన్ను కంట్రోల్‌ చేస్తున్నారన్న ఆరోపణలు చాలా హాసాస్పదం.. వాటికి అసలు ఎటువంటి ప్రాధాన్యతా లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాష్ట్రంలో తిరిగి బీజేడీ ప్రభుత్వ ఏర్పడుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో సైతం 21 స్థానాల్లో గెలుస్తాం. ఒడిశా ప్రజలకు సంక్షేమం అందించడమే నా తొలి ప్రాధాన్యం’’ అని అన్నారు.ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం నవీన్‌ పట్నాయక్‌ మాట్లాడుతుండగా వణుకుతున్న ఆయన చేతులను పాండియన్‌ సరిచేసిన విషయం తెలిసిందే. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ సీఎం పట్నాయక్‌పై విమర్శలు గుప్పించారు. వీకే పాండియన్‌ మాత్రమే నవీన్‌ పట్నాయక్‌తో ఎందుకు ఉంటారో సమాధానం చెప్పాలి. పట్నాయక్‌తో పాటు పాండియన్‌ మైక్‌ పట్టుకొని, వణుకుతున్న చేతులను కంట్రోల్‌ చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. ఎవరీ వీకే పాండియన్‌..?తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ 2000 సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా చేరారు. మొదట్లో ధరమ్‌ఘర్, కలహండి సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఒడిశాలోని అతిపెద్ద జిల్లా మయూర్‌భంజ్‌లో కలెక్టర్‌గా మారుమూల గ్రామాలను అభివృద్ధి చేశారు. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తులకు పునరావాసం కల్పించిన కృషికి వీకే పాండియన్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. 5T కార్యక్రమాల వల్ల దాదాపు తొంభై శాతానికి పైగా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలో పాండియన్‌ కీలకమైన బ్యూరోక్రాట్‌గా పేరు సంపాధించారు. 2011 సంవత్సరంలో వీకే పాండియన్ ప్రతిభను గమనించి సీఎం నవీన్ అతన్ని సీఎం కార్యాలయానికి తీసుకున్నారు. సీఎంకు ప్రైవేట్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఇక.. 2023లో వీకే పాండియన్‌ తన బ్యూరోక్రాట్‌ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం 2023, నవంబర్‌ 27న సీఎం నవీన్‌ పట్నయక్‌ సమక్షంలో బిజు జనతా దళ్‌లో చేరి సీఎంకు సన్నిహితంగా ఉంటూ పార్టీ నేతగా కొనసాగుతున్నారు.

Lok Sabha Election 2024: IT Department Seized Rs 1100 Crore Cash And Jewellery
Lok Sabha Election 2024: 1100 కోట్లు సీజ్‌ చేసిన ఐటీ శాఖ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు-2024 షెడ్యూల్‌లో భాగంగా రేపు చివరి దశలో పోలింగ్‌ జరుగనుంది. నిన్నటితో ప్రచారానిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి మే 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐటీ సోదాల్లో రూ.1100 కోట్ల నగదును అధికారులు సీజ్‌ చేశారు. భారీ మొత్తంలో బంగారం కూడా సీజ్‌ అయ్యింది.వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్‌ కోడ్‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఆదాయ‌ప‌న్ను శాఖ నిర్వ‌హించిన సోదాల్లో సుమారు రూ. 1100 కోట్ల న‌గ‌దును సీజ్ చేశారు. మే 30వ తేదీ వ‌ర‌కు ఆదాయ‌ప‌న్ను శాఖ మొత్తం 1100 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కూడా చేసింది. 2019 నాటి ఎన్నిక‌ల‌తో పోలిస్తే సీజ్ నగదు విలువ దాదాపు 182 శాతం అధికంగా ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ 390 కోట్ల న‌గ‌దును సీజ్ చేశారు.ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఎన్నిక‌ల కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఐటీ శాఖ అన్ని రాష్ట్రాల్లోనూ దాడులు, సోదాలు, త‌నిఖీల‌ను పెంచేసింది. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు వాడుతున్న డ‌బ్బును సీజ్ చేశారు. ఢిల్లీ, క‌ర్నాట‌క, తమిళనాడు రాష్ట్రాల్లో అత్య‌ధిక మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వంద‌ల కోట్ల‌కు పైగా న‌గ‌దు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఏకంగా రూ.150 కోట్ల వ‌ర‌కు నగదును సీజ్ చేశారు. ఇక, తెలంగాణ, ఒడిషా, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కలిసి దాదాపు రూ.100 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు.

Mahesh Babu Emotional Post On Father Krishna 81st Birth Anniversary
కృష్ణ జయంతి.. మిస్‌ అవుతున్నా నాన్నా అంటూ మహేశ్‌ పోస్ట్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. తన నట ప్రస్థానంతో, సాధించిన అవార్డులతో అభిమానుల మనసు ఉప్పొంగేలా చేశారు. నేడు (మే 31) కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని మహేశ్‌బాబు భావోద్వేగానికి లోనయ్యాడు.మిస్‌ అవుతున్నా..హ్యపీ బర్త్‌డే నాన్నా.. నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నాను. కానీ నువ్వు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటావు అంటూ కృష్ణ ఫోటో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.అవి గుర్తు చేసుకుంటేమరోవైపు డైరెక్టర్‌ వివి వినాయక్‌.. కృష్ణతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అసిస్టెంట్‌గా, సహ దర్శకుడిగా కృష్ణగారి నాలుగు సినిమాలకు పని చేశాను. ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) Forever in our hearts, forever a legend 💫 Today, we honour the eternal legacy of Superstar Krishna Garu 🎬 May his invaluable contributions to Indian cinema continue to inspire generations.#SSKLivesOn pic.twitter.com/kRewKGtp18— AMB Cinemas (@amb_cinemas) May 31, 2024

No Tobacco Day 2024: Expert Explains Quit Smoking With These Foods
Anti tobacco day: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!

‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్‌’ అని అప్పుడెప్పుడో గిరీశం సెలవిచ్చాడు కానీ... అదెంత అబద్ధమో... పొగ ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకవైపు పొగాకు వినియోగంపై అవగాహన పెరుగుతున్నా... ఇంకా అజ్ఞానంలో ఉన్నవారూ కొనసాగుతున్నారు. ఒకరకంగా చూస్తే పెరిగిపోతున్నారు. ఇలాంటి వారిలోనూ ధూమపానం వ్యతిరేక ప్రభావాలపై అవగాహన పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ఈ నాటి పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ లక్ష్యాన్ని సాధించామనుకోండి... ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 80 లక్షలుగా ఉన్న పొగాకు సంబంధిత మరణాలను గణనీయంగా తగ్గించవచ్చున్నమాట!ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..1987లో, డబ్యూహెచ్‌ఓలోని సభ్య దేశాలు ఏప్రిల్ 7ని ప్రపంచ ధూమపాన నిరోధక దినోత్సవంగా గుర్తించాయి. అయితే పొగాకు సంబంధిత సమస్యలన్నింటిపై అవగాహన పెంపొందించే ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని 1988లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి డబ్యూహెచ్‌ఓ దాని సభ్య దేశాలు ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.పొగాకు వినియోగ గణాంకాలు:వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గణాంకాల ప్రకారం ఏటా పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా దాదాపు 8 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నట్లు పేర్కొంది. అలాగే దాదాపు 1.3 మిలియన్ల మంది ధూమపానం చేయనివారు సెకండ్‌హ్యాండ్‌ స్మోక్‌కి గురయ్యి, అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు ప్రపంచంలోని దాదాపు 1.3 మిలియన్ల పోగాకు వినియోగదారుల్లో సుమారు 80% మంది మధ్య ఆదాయ దేశాల్లో నివశిస్తున్నారు. కేవలం 2020లో ప్రపంచ జనాభాలో 22.3% మంది పొగాకును ఉపయోగించినట్లు అంచనా. వారిలో 36.7% మంది పురుషులు, 7.8% మంది మహిళా వినియోగదారులు ఉన్నాట్లు వెల్లడయ్యింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల మంది యువకులు ధూమాపానాన్ని సేవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది థీమ్‌:ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్ “పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించడం”. ఈ థీమ్‌ని ఇతివృత్తంగా చేసుకుని పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన పెంచడం, ధూమపానం దూరంగా ఉండేలా ప్రజలను ప్రోత్సహించేలా చేయడం వంటివి చేస్తారు అధికారులు. అంతేగాదు ఈ పొగాకు అడిక్షన్‌ నుంచి ఎలా బయటపడాలి వంటి అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతారు. ఈ పొగాకులో దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల రసాయనాలు ఉంటాయి. అవి సుమారు 50 నుంచి 60 రకాల కేన్సర్‌ కారకాలని నిపుణులు చెబుతున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం డోపమైన్, అసిటైల్‌కోలిన్, నోర్‌పైన్‌ఫ్రైన్, సెరోటోనిన్ వంటి ఆనందకరమైన హార్మోన్‌లను విడుదల చేసి వ్యసపరుడిగా మారుస్తుంది. ఇది క్రమేణ అధిక రక్తపోటు, పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగాకు అడిక్షన్‌ నుంచి బయటపడాలంటే..మన వంటింటిలో ఉపయోగించే వాటితోనే పొగాకు అడిక్షన్‌కు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..ధూమపానం సేవించాలనే కోరిక గలిగనప్పుడూ ప్రత్నామ్నాయ మార్గాలను ఎంచుకోండి. ఆ కోరికను అదుపులో పెట్టుకోలేనట్లు అనిపించనప్పుడూ ఈ క్రింది ఆహార పదార్థాలను పత్యామ్నాయంగా ఉపయోగించండని చెబుతున్నారు నిపుణులు.పుదీనా ఆకులు నమలడం, లేదా పుదీనా నీళ్లు తాగడం. పండ్లు, పచ్చి కూరగాయలు తినడంనీళ్లు ఎక్కువగా తాగడందాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు వంటివి నమలడంగోరు వెచ్చని పాలు తాగడంనిమ్మకాయ నీళ్లు వంటివి తాగాలిపైవాటిలో మీకు నచ్చినవి తాగేందుకు ప్రయత్నిస్తూ ఆ కోరికను నియంత్రించడం వంటివి చేస్తే సులభంగా పొగాకు అడిక్షన్‌ నుంచి బయటపడతారు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా.. రాను మీకు తెలియకుండానే మంచి ఆహారపు అలవాట్లకు అలవాటు పడతారు. దీంతో పాటు చక్కటి వ్యాయమం లేదా ఏదైనా వర్కౌట్‌లతో మైండ్‌ని డైవర్ట్‌ చేస్తూ.. ఉంటే శారీకంగానూ, మానిసకంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అంతరిక్ష వ్యర్థాలకు చెక్‌ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!)

Anant Ambani-Radhika's Cruise Pre-Wedding: Katy Perry Performs
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్‌ ఖర్చు ఎంతో తెలుసా?

బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి, అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో రెండో ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు షురూ అయ్యాయి. దీంతో రోజుకొక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ హాట్‌ టాపిక్‌గా నిలిచింది.ముఖేష​ నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో జూలై 12న ముంబైలో జరగనుంది. దీనికి ముందుగా దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్‌లో రెండో ప్రీ-వెడ్డింగ్‌ వేడుక జరుగుతోంది. జూన్ 1, 2024న ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది.తాజా సమాచారం ప్రకారం అనంత్ అంబానీ-రాధిక మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్‌లో పాపులర్‌ అమెరికన్ గాయని-గేయరచయిత, కేటీ పెర్రీ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం(మే 31) డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో ఈ గ్రాండ్‌ ఈవెంట్‌లో సందడి చేయనుంది. 'లా విటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం) థీమ్‌తో ఈ గాలా సాగుతుంది. ఇందుకు కోసం పాప్ ఐకాన్‌కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. ఖర్చు రూ. 7500కోట్లురూ. 424 కోట్ల విలువైన ఎస్టేట్‌లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్‌ బాష్‌ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు క్రూయిజ్‌లోని ప్రతి సూట్‌ స్పా, జిమ్‌, స్విమ్మింగ్ పూల్‌ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కోదానికి ఖర్చు సుమారు రూ. 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్‌ ఈవెంట్‌లో డీజేలు, బాణా సంచా వెలుగులతో మోత మోగనుంది.కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి.

Ksr Comments On The Importance Of Kcr Behavior In The Parliamentary Elections
గులాబీ పార్టీకి వెరీ వెరీ టఫ్‌ టైం!

తెలంగాణ రాజకీయాలలో పార్లమెంటు ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఒక పెద్ద పరీక్ష కాబోతుండగా, బీజేపీకి ఒక గేమ్‌గా మారబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. దానికి కారణం తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది ఒకటైతే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను రుజువు చేసుకోలేకపోతే తదనంతర పరిణామాల వల్ల నష్టపోయే అవకాశం ఉందన్న భావన మరొకటి అని చెప్పాలి.బీఆర్‌ఎస్‌ విషయం చూద్దాం. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రుజువు చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ది సంగతి ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా అహంభావంతో వ్యవహరించారన్న విమర్శ తెలంగాణ వ్యాప్తంగా ఉంది. సొంత పార్టీవారిని కూడా పెద్దగా కలవకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, శాసనసభ ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులను మార్చవలసి ఉన్నా, మార్చకపోవడం, తనపైనే అంతా నడుస్తుందన్న అభిప్రాయంతో రాజకీయం చేయడం వంటి కారణాల వల్ల ప్రజలలో అసమ్మతి ఏర్పడింది. నిజానికి ఆయన ఓ ఇరవై, ముప్పై మంది అభ్యర్దులను మార్చి ఉంటే తిరిగి అధికారంలోకి వచ్చేవారన్నది ఎక్కువ మంది ఫీలింగ్.సాధారణ ఎన్నికల ముందు వివిధ ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారం చేజిక్కించుకుందంటే ప్రజల అభిప్రాయాలు ఎంత త్వరగా మారతాయో గమనించవచ్చు. ఆ విషయాన్ని కేసీఆర్‌ పసికట్టలేకపోయారు. అక్కడికీ హైదరాబాద్ ప్రాంతంలో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్దిపనులు, విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడడం వంటి కారణాలతో బీఆర్‌ఎస్‌ స్వీప్ చేసింది. కానీ ఇతర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో బాగా దెబ్బతింది. ఫలితంగా అధికారాన్నే వదలుకోవల్సి వచ్చింది. అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ నేతల వ్యవహార సరళి ఎలా మారిపోయిందో చూడవచ్చు. అంతవరకు కేసీఆర్‌ పిలిస్తే చాలు అన్నట్లుగా ఉన్న నేతలు కొందరు ఓటమి తర్వాత మొహం చాటేసేవారు.కేసీఆర్‌ సొంత పార్టీని పునాదుల నుంచి నిర్మించుకోవడం కన్నా ఇతరపార్టీల నేతలను తీసుకు వచ్చి అందలం ఎక్కించడం ద్వారా బలపడదామని అనుకున్నారు. కానీ అదే బెడిసికొట్టింది. ఉదాహరణకు సీనియర్‌ నేత కే. కేశవరావు మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారంటే అది కేసీఆర్‌ పుణ్యమే అని చెప్పకతప్పదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జారుకున్నారు. కేశవరావుకు ఉన్న ప్రజాబలం పునాది చాలా తక్కువే అయినా, కేవలం నోరు పెట్టుకుని రాజకీయాలలో చెలామణి అయ్యారంటే అతిశయోక్తి కాదు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ నుంచి వచ్చిన నేత అయినా.. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రాధాన్యత తగ్గించారన్న భావన ఉంది. కడియం శ్రీహరి కోరుకున్నట్లు ఆయన కుమార్తెకు ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయినా దానిని వదలుకుని కాంగ్రెస్‌లోకి వెళ్లడం పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. దాంతో బీఆర్‌ఎస్‌ బలహీనపడుతోందన్న సంకేతం జనంలోకి వెళ్లింది.మరో కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌కు రెండుసార్లు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లి ఎంపీ అభ్యర్థి అయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాటలోనే ఉన్నారు. కానీ వారంతా పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌కు నాలుగు, ఐదు సీట్లు వస్తే వలసలు తగ్గుతాయి. కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, నాగర్ కర్నూలు సీట్లలో కొన్ని రాకపోతాయా? అని ఆశాభావంగా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఒకటి లేదా రెండు వస్తే గొప్పేనని అంటున్నారు.మెదక్ సీటుపై కొంత ఆశ ఉంది. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో వచ్చే మెజార్టీతో గట్టెక్కవచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. ఒకవేళ ఈ సీటు కూడా రాకపోతే పార్టీకి కష్టాలు తప్పవు. కేసీఆర్‌ జారి గాయపడి కోలుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లకపోవడం కొంత నష్టం చేసిందని చెప్పాలి. ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గింది. కేటీఆర్‌, హరీష్‌రావు వంటివారు ఎంత గట్టిగానే పనిచేసినా, ప్రతిపక్ష నేత అసెంబ్లీలోకి రాకపోవడం బలహీనతగానే చూడాలి. పార్లమెంటు ఎన్నికలలో కేసీఆర్‌ బస్సు యాత్ర చేపట్టిన తర్వాతే పార్టీకి మళ్లీ ఊపిరి పోసినట్లయింది. జనం పెద్ద ఎత్తున తరలిరావడం ఉపశమనం కలిగించింది. అయినా ఓట్లు పడతాయా?లేదా? అనేది చెప్పలేని పరిస్థితి.పార్లమెంటు ఎన్నికలలో ఐదు సీట్లు గెలిచినా, లేకపోయినా కేసీఆర్‌ వ్యవహరించే శైలిపైనే ఆయన పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రజలు తమ ఓట్లను ఈ ఎన్నికలలో బీజేపీకి వేశారన్న అభిప్రాయం ప్రబలింది. బీఆర్‌ఎస్‌ గెలవలేదన్న భావనతో పలువురు ఇలా చేశారన్నది ఒక వాదన. దీనిని కేసీఆర్‌ కానీ, ఆయన పార్టీవారు కానీ అంగీకరించకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ ఐదేళ్లు నిలబడుతుందా? లేక బీజేపీ పుంజుకుని బీఆర్‌ఎస్‌ను దెబ్బతీస్తుందా? అన్నది ఫలితాలను బట్టి ఉండవచ్చు.కాంగ్రెస్ పార్టీ కనీసం ఏడెనిమిది సీట్లు తెచ్చుకోగలిగితే ఆ పార్టీవైపు బీఆర్‌ఎస్‌ నేతలు చూడవచ్చు. అదే బీజేపీ కనుక ఎనిమిది పైగా సీట్లు తెచ్చుకుంటే బీఆర్‌ఎస్‌ పై నమ్మకం కోల్పోయినవారు ఆ పార్టీవైపు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. బీఆర్‌ఎస్‌ను పూర్తిగా దెబ్బతీయడం ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ యత్నిస్తోంది. ముందుగా దీనిని నిరోధించడం పెద్ద సవాలు అవుతుంది. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలనుంచి ఫిరాయింపులపైన అధిక దృష్టి పెట్టారు. ఇతర పార్టీలను బలహీనపర్చడం వేరు. తనపార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేసుకోవడం వేరు. కేసీఆర్‌ మొదటి నుంచి ఈ విషయంలో అంత గట్టిగా లేరనే చెప్పాలి.తెలంగాణ ఉద్యమం పెరగడానికి కారణం అయనే అయినప్పటికీ 2009లో టీఆర్ఎస్‌కు పది అసెంబ్లీ సీట్లే రావడం అప్పట్లో అశనిపాతం అయింది. ఆ రోజుల్లో ఆయన ఒక దశలో నిస్పృహలోకి వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతలో ఆనాటి సీఎం రాజశేఖరరెడ్డి మరణంతో రాజకీయ పరిణామాలు వేగంగా ఆయనకు అనుకూలంగా మారాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్‌ సీఎం కావడం, తొమ్మిదిన్నరేళ్లు నిర్విఘ్నంగా కొనసాగడం జరిగాయి. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడం, ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరింప చేయడం కోసం ప్రయత్నించడం వంటివి కూడా జనానికి పెద్దగా నచ్చలేదు. పేరు మార్చడమే చాలా మందికి ఇష్టం లేదు.అప్పట్లో కాంగ్రెస్‌ను వీక్ చేయడానికి కేసీఆర్‌ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి వారు బీఆర్‌ఎస్‌లో కొనసాగడమా? లేక కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరడంపై ఆలోచన చేస్తారు. కేసీఆర్‌ వీటిని పట్టించుకోనవసరం లేదు. ఆయన నిత్యం ప్రజలలో ఉంటూ, ఐదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుంటే వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ విజయావకాశాలు పెంచుకోవచ్చు. కానీ కేసీఆర్‌ అంత సహనంతో, ఓపికతో రాజకీయం చేయవలసి ఉంటుంది. గత పార్లమెంటు ఎన్నికలలో నాలుగు సీట్లు బీజేపీ గెలుచుకున్నప్పుడే కేసీఆర్‌ అప్రమత్తం అయి ఉండవలసింది. బీజేపీతో అనవసర వివాదాలకు వెళ్లి కొంత నష్టపోయారు. తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం కూడా కొంత అప్రతిష్టగా మారింది.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన బీజేపీవైపు వెళ్లలేరు. అలాగని కాంగ్రెస్‌తో స్నేహం చేయలేరు. సొంతంగా పార్టీ నిలబడాలంటే కేసీఆర్‌ చాలా కష్టపడవలసి ఉంటుంది. నిత్యం ప్రజలలోనే సంచరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయగలగాలి. ఈ లోగా తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములు ఆయన మెడకు చుట్టుకోకుండా ఉండాలి. ఐదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ నిలబడగలిగితే, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడే అసంతృప్తిని క్యాష్ చేసుకుని మళ్లీ అధికారంలోకి రాగలుగుతారు. అంత వరకు వేచి ఉండే ఓపిక, పోరాడే శక్తి కేసీఆర్‌కు ఉన్నాయా? అన్నదే ప్రశ్న.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement