
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చేతిలో అరడజను సినిమాలున్నాయి. క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తున్న రష్మికకు ఇటీవల సడన్ బ్రేక్ పడింది

జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో గాయపడింది. ఇంకా ఆ గాయం నుంచి ఆమె కోలుకోలేకపోతోంది. ఓ పక్క గాయం తనను ఇబ్బందిపెడుతున్నా సరే పనికి మాత్రం విశ్రాంతి ఇవ్వనంటోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో జరిగిన ఛావా (Chhaava Movie) ఈవెంట్‌కు హాజరైంది

నడవలేని స్థితిలో ఉన్న ఆమెను బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వీల్‌చైర్‌లో స్టేజీపైకి తీసుకొచ్చాడు

అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది.









