విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన 75వ చిత్రం సైంధవ్.
ఈ మూవీ నేడు(జనవరి 13న) ప్రేక్షకుల ముందుకువచ్చింది.
ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది.
అయితే ఈమె వెంకీ మామ భార్యనో, ప్రేయసే అనుకునేరు.
కానే కాదు.. కమెడియన్ గెటప్ శ్రీను భార్యగా శ్రద్దాను చూపించాడు డైరెక్టర్.
అయితే అతడు పెట్టే చిత్రహింసలు భరించలేక తనకు దూరంగా ఉంటుంది.
వెంకటేశ్‌కు దగ్గరవుతుంది.
అతడిని ప్రేమిస్తుంది. అతడి కూతురిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది.
మొత్తం అతడి ఇంట్లోనే ఉంటుంది.
అయితే శ్రద్ధాను సింగిల్‌గానో, లేదంటే వెంకీ మామ భార్యగానో చూపించాల్సింది అని నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.


