సింప్లిసిటీకి మారుపేరు సాయిపల్లవి. సినిమా ఫంక్షన్స్‌లోనే కాదు.. ఆఖరికి తన ఇంట జరిగిన పెళ్లిలోనూ అంతే సింపుల్‌గా కనిపించింది.
సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ ఇటీవలే పెళ్లి చేసుకుంది. తన క్లోజ్‌ఫ్రెండ్ వినీత్‌ను పెళ్లాడింది.
ఈ వివాహ వేడుకల్లో సాయిపల్లవి తన సోదరితో కలిసి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేసింది.
అంతేకాదు, ప్రతి వేడుకకు తనను దగ్గరుండి ముస్తాబు చేసింది. ఆమె ముఖంపై చిరునవ్వు చెదరనీయకుండా నిత్యం వెన్నంటే ఉంది.
తాజాగా పూజా కన్నన్ మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియో రిలీజ్ చేసింది.
ఇందులో సాయిపల్లవి స్వయంగా పూజా చేతికి మెహందీ డిజైన్ వేయడం విశేషం
అంత హడావుడిలోనూ చెల్లికి తనే మెహందీ పెట్టిందంటే సాయిపల్లవికి పూజా అంటే ఎంత స్పెషలో కదా!
ఈ మెహందీ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


