ధనుష్ నటించిన 50వ చిత్రం ‘రాయన్’ జులై 26న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు చాలా మంది పెద్ద నటీనటులు ఉన్నా.. సినిమా రిలీజ్ తర్వాత ఒకరి నటన గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆమే దుషారా విజయన్.
రాయన్ మూవీలో ధనుష్ చెల్లెలుగా నటించిన దుషారా.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
డీగ్లామర్ పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లోనే కాకుండా.. యాక్షన్ సీన్లలో కూడా ఇరగదీసింది. సెకండాఫ్‌లో ఆమె చేసే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు.
‘సార్పట్టా పరంబరై’ తర్వాత దుషారాకు అంతటి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా రాయన్.
ఈ చిత్రంలో డీగ్లామర్‌గా కనిపించిన దుషారా..బయట మాత్రం చాలా అందంగా ఉంది.
రాయన్ మూవీ రిలీజ్ తర్వాత దుషారా ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


