
రహస్యం ఎక్కడున్నా అవినీతికి మార్గమే!
నిఘా నివేదికలు ఇచ్చే సంస్థలను, దేశ భద్రత వ్యవ హారాలను పరిశీలించే సంస్థ లను ఆర్టీఐ చట్టం నుంచి పూర్తిగా మినహాయిస్తూ నోటి ఫికేషన్ జారీ చేసే అధికారాన్ని ఆర్టీఐ చట్టం 2005 సెక్షన్ 24 ద్వారా ప్రభుత్వానికి ఇచ్చింది.
విశ్లేషణ
నిఘా నివేదికలు ఇచ్చే సంస్థలను, దేశ భద్రత వ్యవ హారాలను పరిశీలించే సంస్థ లను ఆర్టీఐ చట్టం నుంచి పూర్తిగా మినహాయిస్తూ నోటి ఫికేషన్ జారీ చేసే అధికారాన్ని ఆర్టీఐ చట్టం 2005 సెక్షన్ 24 ద్వారా ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ సెక్షన్ పారదర్శ కతకు పూర్తి విరుద్ధమైన నియమమని పలువురు విమ ర్శించారు. నిఘా, భద్రత సంస్థలను అనవసరమైన ప్రశ్నల నుంచి రక్షించేందుకు ఈ నియమాన్ని చేర్చారు. అయితే పోలీసు సంస్థలకు, రక్షణ సంస్థలకు మినహాయింపు లేదని గమనించాలి.
సెక్షన్ 24: (1) రెండో షెడ్యూలులో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ నియమిత నిఘా భద్రతా సంస్థలకు గానీ, ఆ సంస్థలు ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారానికి గానీ ఈ చట్టంలోని నియమాలేవీ వర్తించవు. కానీ అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ఈ సబ్ సెక్షన్ కింద మినహాయించడానికి వీల్లేదు. అయితే మానవ హక్కుల ఉల్లంఘన గురించి సమాచారాన్ని అడిగినప్పుడు, కేంద్ర సమాచార కమి షన్ అనుమతి తర్వాతనే ఇవ్వవలసి ఉంటుంది.
(2) రెండో షెడ్యూల్‌లో ఇంకే ఇతర నిఘా లేదా భద్రతా సంస్థనైనా చేర్చుతూ లేదా తొలగిస్తూ అధికారిక గెజిట్‌లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయ వచ్చు, అప్పుడు ఆ సంస్థను షెడ్యూలు నుంచి తొలగిం చినట్టు లేదా చేర్చినట్టు భావిస్తారు.
రాష్ట్రాల నిఘా, భద్రతా సంస్థలను మినహా యించడానికి సెక్షన్ 24లో ఇలాంటి నియమాలనే చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ద్వారా రెండో షెడ్యూల్‌లో నిఘా భద్రతా సంస్థలను చేర్చడానికి లేదా తొలగించడానికి వీలుంది. రెండో షెడ్యూలులో చాలా నిఘా సంస్థలను, భద్రతా సంస్థలను చట్టం రూపొందించిన సమయంలోనే మినహాయించారు. ఇంకా ఏమయినా సంస్థలు పొరబాటున మిగిలిపోయి ఉంటే, వాటిని చేర్చడానికి చట్టం సవరించే అవసరం లేకుండా నోటిఫికేషన్ ద్వారా చేర్చే అవకాశాన్ని సెక్షన్ 24 కల్పించింది. నిఘా భద్రతా సంస్థలు కూడా పార దర్శకంగా పనిచేయాలని ప్రభుత్వం అనుకుంటే దాన్ని కూడా మినహాయింపునుంచి తొలగించి వాటి సమా చారాన్ని కూడా ఇవ్వడానికి వీలు కల్పించాలని ఈ చట్టం భావించింది.
కేవలం నిఘా భద్రతా సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని చాలా స్పష్టంగా ఉన్నా.. మణి పూర్ పోలీసు శాఖ నిఘా, భద్రతా సంస్థ కాకపోయినా మణిపూర్ ప్రభుత్వం దాన్ని మినహాయించింది. అవి నీతి, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే వీలు కల్పించడం ద్వారా, మినహాయించిన సంస్థలు కూడా పారదర్శకతకు అతీ తం కాదని ఆర్టీఐ స్పష్టం చేసింది. అయితే అవినీతి, మానవ హక్కులకు సంబంధించిన అనే వాక్యానికి అసలు అర్థాన్ని, లక్ష్యాన్ని తెలుసుకునేందుకు హైకోర్టుల తీర్పులు మనకు ఉపకరిస్తాయి. మినహాయించిన సంస్థల సమాచారాన్ని అడిగిన అనేక సందర్భాలలో హైకోర్టులు పారదర్శకత సాధించడానికి సరైన వివరణ లను, సూత్రాలను రూపొందించాయి.
ఒక డాక్టర్ దేశం వదిలి వెళ్లిపోయిన వివరాలు, ఆ తరువాత మరణించిన సమాచారం ఇవ్వాలని ఇంటెలి జెన్స్ బ్యూరోను కోరుతూ ఒక ఆర్టీఐ అభ్యర్థన దాఖ లైంది. ఐబీ సంస్థకు ఆర్టీఐ వర్తిస్తుందంటూ ఐబీ వారు నిరాకరించారు. కానీ సెక్షన్ 24 ఒకటో మినహాయింపు కింద అడిగిన సమాచారం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. భారత ప్రభుత్వం ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అడిగిన సమాచారం అవినీతి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినది కనుక ఇవ్వాలన్న సీఐసీ ఆదేశాన్ని కొట్టివేస్తూనే, ఒక పౌరుడి హక్కుల అమలుకు ఉపయోగపడే సమాచారం తమ దగ్గర ఉంటే ఇవ్వడమే శ్రేయస్కరమని ఢిల్లీ హైకోర్టు భావించింది (యూని యన్ ఆఫ్ ఇండియా ఆదర్శ శర్మ కేసు 2013).
పంజాబ్ హరియాణా హైకోర్టు ముందుకు ఇటువంటి కేసు మరొకటి వచ్చింది. సెక్షన్ 24 కింద ఆర్టీఐ నుంచి మినహాయించిన సంస్థలో సీఐడీ సంస్థలో ఉద్యోగ ఖాళీలు ఏయే విభాగాల్లో ఎన్ని ఉన్నాయనే సమాచారం అడిగారు. నియామకాలలో అవినీతిని నిరోధించేందుకు ఈ సమాచారం ఉపయోగిస్తుందని, ఇది అవినీతికి సంబంధించిన సమాచారమే అవుతుం దని (ఎల్‌పీఏ 744,755 ఆఫ్ 2011, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ అదనపు డీఐజీ, సీఐడీ, హరియాణా వర్సెస్ సీఐసీ) 2011లో ఆదేశించింది. వీరి మధ్యే 12904 ఆఫ్ 2009 నెంబర్ రిట్ పిటిషన్‌లో నిఘా భద్రతకు సంబం ధించిన సమాచారం తప్ప మిగిలిన అన్ని రకాల సమా చారాన్ని ఇవ్వవలసిందే అని హైకోర్టు న్యాయమూర్తి మొహిందర్ సింగ్ సుల్లూర్ 27 జనవరి 2011న తీర్పు చెప్పారు.
మొత్తం సమాచార హక్కు చట్టాన్ని సమ గ్రంగా అధ్యయనం చేస్తే అర్థమయ్యేదేమంటే నిఘా, భద్రతకు సంబంధించి సంస్థను దెబ్బతీసే సమాచారం మాత్రమే ఇవ్వకూడదు. కానీ సమాచారం ఇవ్వకుండా పూర్తిగా మినహాయించడం సరికాదు. ఈ కేసులో అడి గిన విధంగా పోస్టుల సంఖ్య, ఖాళీలపై ఒక దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
మినహాయించిన సంస్థలు కూడా పాలనాపరమైన సమాచారాన్ని ఇవ్వాల్సిందే. నిఘా నివేదికలు, భద్రతకు సంబంధించిన సమాచారం మాత్రమే మినహాయిం చాలి. పారదర్శకత ద్వారా అవినీతిని ఎదుర్కొనడానికి ఆర్టీఐని వినియోగించకుండా సెక్షన్ 24 మినహాయింపు ఆపలేదని ఐబీ గానీ, తదితర సంస్థలు గానీ తెలుసు కోవలసిన అవసరం ఉంది. రహస్యం ఎక్కడున్నా అది అవినీతికి దారితీస్తుంది, లంచగొండితనం దేశ భద్రతకు కూడా ముప్పు తెస్తుంది.
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్
కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com