ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా నిప్పులు చెరిగారు.
	అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా నిప్పులు చెరిగారు.  చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని ఆదివారం అనంతపురంలో మండిపడ్డారు. అందుకే రాజధాని శంకుస్థాపన పేరుతో చంద్రబాబు రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు నివసించడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో సాధ్యమని చాంద్ బాషా స్పష్టం చేశారు.  
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
