వైఎస్ జగన్ దీక్ష ఆగదు | Ys jagan mohan reddy deeksha will not stop anymore | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ దీక్ష ఆగదు

Sep 25 2015 3:41 AM | Updated on Mar 23 2019 9:10 PM

వైఎస్ జగన్ దీక్ష ఆగదు - Sakshi

వైఎస్ జగన్ దీక్ష ఆగదు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన

* వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ
* ఉల్ఫ్ హాలు గ్రౌండ్‌లో దీక్షకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్
* శుక్రవారం సాయంత్రానికి అనుమతి వస్తుందని విశ్వాసం
 

సాక్షి, విజయవాడ బ్యూరో/ గుంటూరు:  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ పరిశీలకుడు బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. 26వ తేదీ ఉదయం నుంచి గుంటూరు ఉల్ఫ్ హాలు గ్రౌండ్‌లోనే దీక్ష చేపడతారని స్పష్టం చేశారు. గురువారం ఉదయం గుంటూరు ఐజీ ఎన్.సంజయ్‌తో చర్చలు జరిపిన తర్వాత, అనంతరం సాయంత్రం గుంటూరు దీక్షా ప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉల్ఫ్ హాలు గ్రౌండులో దీక్షకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ వేశామని శుక్రవారం సాయంత్రానికి అనుమతి వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. జగన్ దీక్షకు సంబంధించి తాము గతంలోనే మూడు ప్రాంతాలను పోలీసులకు తెలియజేశామని, వాటిని నిరాకరించడంతో ప్రైవేటు యాజమాన్యానికి చెందిన ఉల్ఫ్‌హాలు గ్రౌండ్‌ను అద్దెకు తీసుకున్నామని చెప్పారు.
 
 అయితే ప్రభుత్వ ఒత్తిడి మేరకు పోలీసులు అక్కడ దీక్షకు అనుమతులు నిరాకరించడం దారుణమన్నారు. హోదా వచ్చే వరకూ పోరాటం చేస్తామని, చంద్రబాబు గుండెల్లో నిద్రపోతామని బొత్స హెచ్చరించారు. హోదాకోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఆ పనిచేయకపోగా, రాష్ట్ర భవిష్యత్తుకోసం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తుంటే దాన్ని ఆపాలని చూస్తున్నాడని ఆరోపించారు.  నిరవధిక దీక్షపై బాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. పొట్టిశ్రీరాములు నిరవధిక దీక్ష చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఉండేదా? అని ప్రశ్నించారు. హోదా అనేది భావితరాల భవిష్యత్ కోసమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని తెలిపారు. హోదా కోసం ఇతర ప్రజా సంఘాలను కలుపుకుని ఆందోళనలు చే పడతామని ఆయన వెల్లడించారు.

ఐజీతో జరిగిన చర్చల్లో పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, కొడాలి నాని,  మాజీ మంత్రులు కొలుసు పార్థసారధి, మోపిదేవి వెంకటరమణ, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, తాడికొండ, తెనాలి, వినుకొండ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు హెనీ క్రిస్టినా, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement