మోడల్ స్కూల్ టీచర్లకు అండగా ఉంటానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య హామీ ఇచ్చారు.
అనంతపురం ఎడ్యుకేషన్: మోడల్ స్కూల్ టీచర్లకు అండగా ఉంటానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్ (ఎంఎస్‌పీటీఏ) ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. సీపీఎస్ పథకం, పీఆర్సీ వర్తింపు, సర్వీస్ రూల్స్‌విడుదల, హెల్త్‌కార్డ్స్, బాలికల వసతి గృహాల వార్డన్ సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.