భారతీయ ఉద్యోగులే లక్ష్యం? | Sakshi
Sakshi News home page

భారతీయ ఉద్యోగులే లక్ష్యం?

Published Thu, Jan 14 2016 1:52 AM

భారతీయ ఉద్యోగులే లక్ష్యం?

వీసా ఫీజుల పెంపులో ఉద్దేశమేంటి?
భారతీయ ఐటీ కంపెనీలేనా టార్గెట్!

 
 వాషింగ్టన్: భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎటువైపు దారి తీస్తున్నాయి?. ఇటీవల ఇమ్మిగ్రేషన్ పేరుతో భారత విద్యార్థులను తిరిగి పంపించేశారు. అమెరికాలోని కంపెనీల్లో పనిచేసే విదేశీయులకు జారీ చేసే హెచ్1బీ, ఎల్1 వీసా ఫీజులను భారీగా పెంచారు. దీంతో అక్కడి భారత ఐటీ కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడనుంది. అమెరికా ఎందుకిలా చేస్తోంది?  ఆదాయం పెంచుకోవడానినా..! భారతీయ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకా..! ఈ సాకుతో అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్యను తగ్గించేందుకేనా..?

 పెంచిన ఫీజు చెల్లించాల్సిందేనా..
 హెచ్1బీ, ఎల్1 వీసాల జారీకి పెంచిన ఫీజులు 2015 డిసెంబర్ 18 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా పేర్కొంది. దీంతో డిసెంబర్ 18 తర్వాత ఈ వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారంతా పెంచిన ఫీజు చెల్లించాల్సి వస్తుంది. పెంచిన ఫీజులను నోటిఫై చేస్తూ అమెరికా మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. పెంచిన ఫీజు ప్రకారం హెచ్1బీ వీసాల కోసం రూ.2.7 లక్షలు, ఎల్1ఏ, ఎల్1బీ వీసాల కోసం దాదాపు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 50 శాతం కన్నా ఎక్కువ మంది విదేశీయులు ఉన్న కంపెనీలకు ఈ ఫీజు పెంపు వర్తిస్తుంది. దీంతో అక్కడికి వెళ్లే ఉద్యోగుల నుంచి కంపెనీలు ఈ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంది.

పైగా ఈ ఫీజు ప్రాసెసింగ్, ఫ్రాడ్ ప్రివెన్షన్ తదితర ఫీజులకు అధికం. కాగా, తాజాగా పెంచిన ఫీజులు 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది. సవరించిన చట్టం ప్రకారం కనుక ఫిబ్రవరి 11 తర్వాత వచ్చిన దరఖాస్తులు లేకపోతే తిరస్కరిస్తామని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా దరఖాస్తు పత్రాలను సీఐఎస్ సవరించింది. ఇప్పటి వరకు ఏటా రూ.467 కోట్లు ఐటీ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయని, తాజా నిర్ణయంతో దాదాపు రూ.9350 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని నాస్‌కాం అనే భారత్‌కు చెందిన ఐటీ కంపెనీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement