నిబంధనలు అతిక్రమించి గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఇద్దరు డాక్టర్లను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంఢీఘర్:నిబంధనలు అతిక్రమించి గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఇద్దరు డాక్టర్లను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానా నుంచి వచ్చిన డాక్టర్లు కొన్ని క్లినిక్ ల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న సమాచారంపై మాటు వేసిన పోలీసులు వేర్వేరు ఘటనల్లో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మహేందర్ ఘర్ జిల్లాలోని కనీనా గ్రామంలోని ఒక డాక్టర్ ను అదుపులోకి తీసుకోగా, భివానీ జిల్లాలోని ఛర్కీ దాద్రీ గ్రామంలో మరొక డాక్టర్ని అరెస్ట్ చేశారు. శిశు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నిబంధనలు అతిక్రమిస్తున్నఆస్పత్రులపై దాడి చేశారు.
ఈ క్రమంలోనే సంజీవిని ఆస్పత్రిలో ఒక డాక్టర్ ను అరెస్టు చేయగా, గుడ్డి క్లినిక్ లో మరొకర్నిఅదుపులోకి తీసుకున్నారు. ఈ పరీక్షలకు రూ.7,000 చొప్పున డాక్టర్లు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.