
సల్మాన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ: ఫస్ట్ లుక్ ఇదే!
వరుస బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు దడ పుట్టిస్తున్న సూపర్ డూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.
వరుస బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు దడ పుట్టిస్తున్న సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. భజరంగీ భాయ్‌జాన్, సుల్తాన్ వంటి భారీ సూపర్‌హిట్ల తర్వాత ఆయన నటిస్తున్న తాజా సినిమా ’ట్యూబ్‌లైట్’... సల్మాన్‌తో ’ఏక్ థా టైగర్’, ’బజరంగీ భాయ్‌జాన్’ వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకుడు. అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. రానున్న దీపావళి పండుగ సీజన్‌లో ‘ట్యూబ్‌లైట్’ సినిమా విడుదల కాబోతున్నదంటూ ప్రకటించింది.
‘ట్యూబ్‌లైట్’ సినిమాలో సల్మాన్ ఫస్ట్‌లుక్ విభిన్నంగా ఉండి.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కబీర్ ఖాన్ శైలి, సల్మాన్ అమాయకత్వం ఈ పోస్టర్‌లో దర్శనమిస్తోంది. ‘శాంతి, గౌరవం, ప్రేమ, కాంతి మీ జీవితాల్లో వెల్లివిరియాలని ట్యూబ్‌లైట్ టీమ్ ఆశిస్తోంది’ అంటూ ఫస్ట్‌లుక్‌ను సల్మాన్ ట్వీట్ చేశారు.
Peace, Respect, Love and Light in your life from the Tubelight team . pic.twitter.com/BXjkn0Xc9m
— Salman Khan (@BeingSalmanKhan) 20 April 2017