ఇరు వర్గాల ఘర్షణ... పది మందికి గాయాలు | Ten injured, two parties conflict | Sakshi
Sakshi News home page

ఇరు వర్గాల ఘర్షణ... పది మందికి గాయాలు

Aug 16 2015 9:50 PM | Updated on Sep 3 2017 7:33 AM

నల్లగొండ జిల్లా దిండి మండలం ఎర్రారం గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మందికి గాయాలయ్యాయి.

దిండి: నల్లగొండ జిల్లా దిండి మండలం ఎర్రారం గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లెళ్ల పెద్ద జంగయ్య వద్ద బర్కతుల్లా ఏడాది క్రితం కొంత మెత్తం అప్పు తీసుకున్నాడు. అందుకు హామీగా తన భూమిలో కౌలు చేసుకునేందుకు జంగయ్యను అనుమతించాడు.

అయితే, తీసుకున్న అప్పు తీర్చకుండానే బర్కుతుల్లా తన భూమిని పెద్ద జంగయ్య సోదరుడు చిన్నజంగయ్యకు విక్రయించాడు. దీంతో ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పది మంది గాయపడ్డారు. యాంగిర్‌బీ, స్వామి, తిరుపతయ్యలకు తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement