నిరాశపర్చిన టాటాపవర్ | Tata Power Slumps As Q1 Net Plunges 76percent | Sakshi
Sakshi News home page

నిరాశపర్చిన టాటాపవర్

Aug 23 2016 3:28 PM | Updated on Sep 4 2017 10:33 AM

ముంబైకి చెందిన ప్రయివేట్‌ రంగ విద్యుత్‌ దిగ్గజం టాటా పవర్‌ మంగళవారం క్యూ1 ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభాల్లో 76 శాతం, ఆదాయంలో 5శాతం క్షీణతను నమోదు చేసింది

ముంబై:  ముంబైకి చెందిన  ప్రయివేట్‌ రంగ విద్యుత్‌ దిగ్గజం టాటా పవర్‌  మంగళవారం క్యూ1 ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన  నికర లాభాల్లో 76 శాతం, ఆదాయంలో 5శాతం క్షీణతను నమోదు చేసింది.  ఇది గత ఏడాది రూ.303కోట్ల తోపోలిస్తే  నికర లాభాలో భారీగా క్షీణించాయి.  ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం రూ. 72.5 కోట్లను  ప్రకటించింది. ఆదాయం కూడా రూ. 7184 కోట్ల నుంచి రూ. 6838 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1636 కోట్లకు చేరగా, ఇతర ఆదాయం 54 శాతం తగ్గి రూ.112 కోట్లకు పరిమితమైంది. ఈ కాలంలో రూ. 312 కోట్లమేర వన్‌టైమ్‌ నష్టం నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది.

ఈ నిరుత్సాహకర ఫలితాలతో   టాటా పర్ షేరు దాదాపు 3శాతానికిపైగా క్షీణించింది.  అయితే నికర లాభాలు రూ.335 కోట్లు, ఆదాయాన్ని రూ.9,270కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనావేశారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement