ఇళ్ల స్థలాల కేటాయింపుపై మీ విధానం ఏమిటి? | Supreme Court to Notices All states including the center | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాల కేటాయింపుపై మీ విధానం ఏమిటి?

Apr 21 2017 2:13 AM | Updated on Sep 2 2018 5:43 PM

ఇళ్ల స్థలాల కేటాయింపుపై మీ విధానం ఏమిటి? - Sakshi

ఇళ్ల స్థలాల కేటాయింపుపై మీ విధానం ఏమిటి?

న్యాయ మూర్తులు, ఎమ్మెల్యేలు, ఐఏ ఎస్, ఐపీఎస్‌ అధికారులు, జర్నలిస్టులు, ఇతర వర్గాలు, క్రీడాకారులు తదితర వ్యక్తుల కు ఇళ్ల స్థలాల కేటాయిం పునకు సంబంధించి దేశవ్యా ప్తంగా ఏకరీతి విధానం

కేంద్రం సహా అన్ని రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉంటే బాగుంటుందన్న జస్టిస్‌ చలమేశ్వర్‌
ఎమ్మెల్యేలు, ఐఏఎస్, విలేకరుల ఇళ్ల స్థలాల కేసు విచారణ
మే 2కు విచారణ వాయిదా


సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ మూర్తులు, ఎమ్మెల్యేలు, ఐఏ ఎస్, ఐపీఎస్‌ అధికారులు, జర్నలిస్టులు, ఇతర వర్గాలు, క్రీడాకారులు తదితర వ్యక్తుల కు ఇళ్ల స్థలాల కేటాయిం పునకు సంబంధించి దేశవ్యా ప్తంగా ఏకరీతి విధానం ఉండడం మేలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆయా వర్గాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సొసైటీల పేరిట హైదరాబాద్‌లో స్థలాలు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు గతంలో తీర్పు ప్రకటిస్తూ ఈ పథకంలో లబ్ధిదారులు, వారి భార్యాపిల్లలపై జంటనగరాల పరిధిలో స్థలాలు, ఇళ్లు కలిగి ఉంటే ప్రభుత్వం స్థలాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది.

 ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం, సొసైటీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిం చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే స్వల్ప మార్పులు కోరుతున్నామని, ఈ దిశగా నూతన విధానం తెస్తామని, ఇందుకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది దవే కోరారు.

 ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తన వాదనలు వినిపిస్తూ సమాజంలోని పలుకుబడి కలిగిన వర్గాలకు మాత్రమే స్థలాలు కేటాయించి, ఇతరులపై వివక్ష చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించడమేనని ఆక్షేపించారు. మరో న్యాయవాది నిరంజన్‌ తన వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ సంస్థలకు కాకుండా ఇతర సంస్థలు, సొసైటీలకు ఇవ్వాల్సి వస్తే ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల కేటాయించాలని ఇచ్చిన జీవోను ఉల్లంఘించి హౌజింగ్‌ సొసైటీకి ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల స్థలాలు కేటాయించారని పేర్కొన్నారు.

ఏకరీతి విధానం ఉండాలి..
నివాసం అనేది ప్రాథమిక అవసరంగా అభిప్రాయం వెలిబుచ్చిన జస్టిస్‌ చలమేశ్వర్‌.. ఈ విషయంలో ఏకరీతి విధానం ఉంటే బాగుంటుందని చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉందని, భూములు రాష్ట్ర పరిధిలోని అంశమే అయిన ప్పటికీ.. కేంద్రం ఒక ఉమ్మడి విధానం, ఉమ్మడి మార్గదర్శకాలు రూపొందించ వచ్చన్నారు. రాష్ట్రాలు సొసైటీలు, వ్యక్తులకు స్థలాల కేటాయింపుపై అనుసరిస్తున్న విధానం, దేశవ్యాప్తంగా ఏకరీతి విధానం అనుసరించేందుకు ఉన్న సానుకూలతలపై అభిప్రాయం తెలపాలని కేంద్రం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

వారంలోగా అభిప్రాయం తెలపాలని ఆదేశించారు. విచారణను మే 2వ తేదీకి వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాలను సొసైటీలు లబ్ధిదారులకు అందజేయడం ద్వారా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సొసైటీల తరపు న్యాయవాదులు కోరగా.. ఇందుకు జస్టిస్‌ చలమేశ్వర్‌ సుముఖత చూపినప్పటికీ.. వారు కేవలం అభివృద్ధి చేసుకునే అవకాశం కోరడం లేదని, ఓనర్‌షిప్‌ కోరుతున్నారని ప్రశాంత్‌ భూషణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించి కేసును త్వరగా పరిష్కరిస్తామని ధర్మాసనం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement