మరో రూ. 200 కోట్లు చెల్లించండి.. | Subrata Roy to deposit another Rs 200 cr to remain on parole | Sakshi
Sakshi News home page

మరో రూ. 200 కోట్లు చెల్లించండి..

Oct 21 2016 5:11 PM | Updated on Sep 4 2017 5:54 PM

మరో రూ. 200  కోట్లు చెల్లించండి..

మరో రూ. 200 కోట్లు చెల్లించండి..

సహారా సంస్థల చీఫ్‌ సుబ్రతారాయ్‌ కి సుప్రీంకోర్టు మరోసారి ఊరటను కల్పించింది. సహారా అధిపతి పెరోల్‌ ను నవంబరు 28వ తేదీవరకు పొడిగించింది.

న్యూఢిల్లీ: సహారా సంస్థల చీఫ్‌ సుబ్రతారాయ్‌ కి సుప్రీంకోర్టు మరోసారి ఊరటను కల్పించింది.  సహారా అధిపతి పెరోల్‌  ను నవంబరు 28వ తేదీవరకు పొడిగించింది.  సహారా గ్రూప్‌ సెబీకి ఈ నెలాఖరుకు రూ.200కోట్లు డిపాజిట్‌ చేయడానికి అంగీకరించడంతో కోర్టు ఈ ఆయనకు  వెసులుబాటును  కల్పించింది.  నవంబరు 28 లోపు  200 కోట్ల  రూపాయలను చెల్లించాలని  చీఫ్ జస్టిస్ టీ.ఎస్ థాకూర్, జస్టిస్ అనిల్  దావే,  ఏకే సిక్రీ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
 
ఈ కేసు విచారణ సందర్భంగా   సెప్టెంబర్28 నాటి కోర్టు ఆదేశాల ప్కారం  సహారా  న్యాయవాదిబశుక్రవారం రూ.215కోట్లు డిపాజిట్‌ చేశారు.  మరో రూ.200కోట్లను ఈ నెలాఖరుకు డిపాజిట్‌ చేయనున్నట్టు కోర్టుకు స్పష్టం చేసింది. అలాగే గతంలో సుప్రీం ఆదేశాలకు మేరకు  సెబీకి రూ.12వేల కోట్లు ఏ విధంగా చెల్లిస్తారనే అంశంపై సుబ్రతారాయ్‌ న్యాయవాది కోర్టుకు రోడ్‌ మ్యాప్‌ అందజేశారు.  డిసెంబరు 2018 నాటికి సహారా పూర్తి చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

కాగా సెబీలో అవకతవకల కేసులో సుబ్రతారాయ్‌ రెండేళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ ఏడాది  మే నెలలో తల్లి మరణించడంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. సెబీకి రూ.500కోట్లు చెల్లించే ఒప్పందంతో కోర్టు గతంలో పెరోల్‌ పొడిగించిన న్యాయస్థానం  షరతులతో పెరోల్‌ పొడిగిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement