'సబ్ కే సాత్, సబ్ కా వికాస్' | Sub ke saath, sub ka vikas, says Arun jaitley | Sakshi
Sakshi News home page

'సబ్ కే సాత్, సబ్ కా వికాస్'

Jul 10 2014 11:35 AM | Updated on Apr 3 2019 5:16 PM

'సబ్ కే సాత్, సబ్ కా వికాస్' - Sakshi

'సబ్ కే సాత్, సబ్ కా వికాస్'

అధిక జనాభా కారణంగా దేశాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

న్యూఢిల్లీ: అధిక జనాభా కారణంగా దేశాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ను గురువారం ఆయన ప్రవేశపెట్టారు. అందరికీ సాయం, అందరికీ అభివృద్ధి(సబ్ కే సాత్, సబ్ కా వికాస్) అనేదే తమ లక్ష్యమని జైట్లీ పేర్కొన్నాడు.

రెండు, మూడేళ్లలో 7-8 శాతం వృద్ధిరేటు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ద్రవ్యలోటును అధిగమించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని అన్నారు. నల్లధనం కలుగుతున్న నష్టాన్ని గుర్తించామని చెప్పారు. నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవకాశాలు కోల్పోతున్నామని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement