నేటి నుంచి అయోధ్య కేసుల విచారణ | Special CBI Court to Hear Ayodhya Case on May 24 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అయోధ్య కేసుల విచారణ

May 24 2017 8:16 AM | Updated on Sep 5 2017 11:54 AM

బాబ్రీ మసీదు కూల్చివేత కేసును నేడు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించనుంది.

లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులుసహా బీజేపీ సీనియర్‌ నాయకులు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ ఉమా భారతిలపై నమోదైన కేసును నేడు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించనుంది. కుట్ర ఆరోపణలపై నేర విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆడ్వానీ, జోషీ, ఉమా భారతిలను గత నెలలో ఆదేశించిన సుప్రీంకోర్టు.. సంబంధిత కేసును రాయ్‌బరేలీ నుంచి లక్నోకు బదిలీచేయాలని ఆదేశాలిచ్చింది.

మరో కేసులో నిందితుల్లో ఒకరైన సతీశ్‌ ప్రధాన్‌ హాజరుకాకపోవడంతో కేసును కోర్టు విచారించలేదు. రాజకీయంగా సున్నితమైన కేసు కావడంతో ఈ కేసును సీబీఐ కోర్టు ప్రతిరోజూ విచారిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement