గౌతమీపుత్ర శాతకర్ణిలో మరో సూపర్ స్టార్ | Shivrajkumar's crucial cameo in 'Gauthamiputra Satakarni' | Sakshi
Sakshi News home page

గౌతమీపుత్ర శాతకర్ణిలో మరో సూపర్ స్టార్

Oct 31 2016 12:51 PM | Updated on Sep 4 2017 6:48 PM

గౌతమీపుత్ర శాతకర్ణిలో మరో సూపర్ స్టార్

గౌతమీపుత్ర శాతకర్ణిలో మరో సూపర్ స్టార్

భారీబడ్జెట్ తో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ 100వ సినిమాగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి లో సూపర్ స్టార్ నటించనున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటించనున్నారు.

చెన్నై:భారీబడ్జెట్ తో  టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ 100వ సినిమాగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణిలో మరో  సూపర్ స్టార్ నటించనున్నారు.  నిర్మాత వై రాజీవ్ రెడ్డి  సారధ్యంలో రూపుదిద్దుకుంటున్న  ఈ  ప్రతిష్టాత్మక మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్  కూడా   నటించనున్నారు.  ముఖ్యమైన అతిధి  పాత్రను ఆయన పోషిస్తున్నారని  నిర్మాత రాజీవ్ ధ్రువీకరించారు. ముఖ్యంగా ఆయన కుటుంబంలో ముఖ్య నటులెవ్వరికీ దక్కని  పాత్రలో కనిపించనున్నారని ఐఏఎన్ఎస్ తో  చెప్పారు.  శివరాజ్కుమార్ తండ్రి రాజ్ కుమార్, సోదరుడు పునీత్ కుమార్ లాంటి ప్రముఖ నటులు కూడా పోషించని ఒక ముఖ్యమైన పాత్రలో ఆయన నటించడం ఆసక్తికరమని రాజీవ్  చెప్పారు. ఇంతకు మించి ఆయన  క్యారెక్టర్ గురించి ఏమీచెప్పలేనని, ఆయన పాత్ర చిత్రీకరణ నవంబరు 15నుంచి మొదలుకానున్నట్టు తెలిపారు. దాదాపు షూటింగ్ మొత్తం  పూర్తి కావచ్చిందనీ, వచ్చే సంక్రాంతికి  సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

కాగా నేషనల్ అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో  వస్తున్న ఈ సినిమాలో  శ్రియ శరణ్, హేమమాలిని, కబీర్ బేడి తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement