లైవ్‌లో సొంత చెల్లెలిని చంపేసింది! | She Killed Her Own Sister | Sakshi
Sakshi News home page

లైవ్‌లో సొంత చెల్లెలిని చంపేసింది!

Jul 25 2017 3:42 PM | Updated on Aug 14 2018 3:22 PM

లైవ్‌లో సొంత చెల్లెలిని చంపేసింది! - Sakshi

లైవ్‌లో సొంత చెల్లెలిని చంపేసింది!

నా ప్రియమైన సోదరి చనిపోతున్నదు.. ఆమెను చంపాలని నేను అనుకోలేదు.. అయినా తను చనిపోతున్నది..

అడ్డదిడ్డంగా కారును నడిపి.. ఆ ప్రమాదంలో చెల్లెలు చనిపోతుండగా.. ఆ ఘటనను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది ఓ ప్రబుద్ధురాలు. అమెరికాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిరేపింది. 18 ఏళ్ల అబ్డులియా సాంచెజ్‌ కాలిఫోర్నియా హైవేపై కారును నడుపుతూ ఒక్కసారిగా అదుపు కోల్పోయింది. దీంతో రోడ్డు అంచుల వరకు వెళ్లి తిరిగి మలుపుతీసుకొని.. ఆ తర్వాత పక్కన ఉన్న వైరు ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో వెనుకసీటులో కూర్చున్న సాంచెజ్‌ 14 ఏళ్ల సోదరి జాక్వలిన్‌, మరో టీనేజ్‌ అమ్మాయి కారులోంచి బయటకు ఎగిసిపడ్డారు.

ఇద్దరూ సీటు బెల్ట్‌లు ధరించలేదు. ప్రమాదం అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌స్టీమింగ్‌ చేసిన సాంచెజ్‌ తన ప్రియమైన సోదరి జాక్వలిన్‌ చనిపోతున్నదని, ఆమెను చంపాలని తాను అనుకోలేదని, అయినా ఆమె చనిపోతున్నదని పేర్కొంది. ప్రమాదం కారణంగా తలనుంచి తీవ్రరక్తస్రావమైన జాక్వలిన్‌ ఆ తర్వాత కాపేటికే చనిపోయింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ప్రమాదంపై సాంచెజ్‌ తండ్రి స్పందిస్తూ తన పెద్ద కూతురే తన సొంత చెల్లెలిని చంపేసిందని పేర్కొన్నారు. 'తానేదో తప్పు చేసింది. ఆ విషయం తనకు చెడుగా అనిపించింది. అందుకే సొంత చెల్లెలిని తను చంపేసింది' అని ఆయన మీడియాతో చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కారును అడ్డదిడ్డంగా నడిపి సోదరి మృతికి కారణమైనట్టు సాంచెజ్‌ పోలీసు కేసును ఎదుర్కొంటున్నది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement