పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు | selected celebrities for Padma Awards | Sakshi
Sakshi News home page

పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు

Jan 25 2014 3:48 PM | Updated on May 28 2018 2:10 PM

పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు - Sakshi

పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు

వివిధ రంగాలలో విశిష్ట సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డుల ప్రకటనకు రంగం సిద్ధమైంది.

న్యూఢిల్లీ: వివిధ రంగాలలో విశిష్ట సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఇచ్చే  పద్మ అవార్డుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. దేశంలో ద్వితీయ అత్యున్నత పౌరపురస్కారం పద్మ అవార్డులకు ప్రభుత్వం127 మందిని ఎంపిక చేసింది. ఇద్దరికి పద్మవిభూషణ్, 24 మందికి పద్మభూషణ్, 101 మందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వనున్నారు. వారిలో 27 మంది మహిళలు, ఏడుగురు ప్రవాస భారతీయులు, విదేశస్తులు ఉన్నారు. ఈ ఏడాది పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన కొందరు ప్రముఖల పేర్లు ఈ దిగువ ఇస్తున్నాం.

 పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైనవారు:

ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ఏ మషేల్కర్
యోగా గురువు బికెఎస్ అయ్యంగార్

 పద్మభూషన్ అవార్డులకు ఎంపికైనవారు:

ప్రముఖ సినిమా నటుడు కమల్ హాసన్
ఇటీవల మరణించిన జస్టిస్ జెఎస్ వర్మ
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్   
స్వర్గీయ అనుమోలు రామకృష్ణ
టెన్నీస్ క్రీడాకారులు లియాండర్ ఫేస్
తమిళ రచయిత విఆర్ థెవర్
 గాయకుడు ప్రవీణ్ సుల్తాన్
జస్టిస్ దల్వీర్ బండారి
రచయిత రుష్కిన్ బాండ్

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనవారు:

డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్
డాక్టర్ గోవిందన్ సుంరరాజన్
మహ్మద్ అలీబేగ్
డాక్టర్ అనుమోలు రామారావు
నర్రా రవికుమార్
ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్
సర్వేస్వర్ సహారియా
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్
ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్
ప్రముఖ క్రికెటర్ క్రీడాకారిణి అంజుమ్ చోప్రా
ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ పద్మశ్రీ
బాలీవుడ్ వెటరన్ యాక్టర్ పరేష్ రావల్
రచయిత అశోక్ చక్రధర్
భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్
ఇటీవల మరణించిన నరేంద్ర ధబోల్కర్
డాక్టర్ ఎస్ సారయ్య
బన్సీ కౌల్
డాక్టర్ సునీల్ ప్రధాన్
డాక్టర్ రాజేష్ గ్రోవర్
డాక్టర్ టిపి జాకోబ్
లవ్ రాజ్ సింగ్
హెచ్.బి.ప్రభు
మంతా సోథా
ప్రతాప్ గోవింద్ రావు పవార్


రిపబ్లిక్ డే నాడు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement