ఇటాలియన్ మెరైన్స్పై న్యాయవిచారణ నిలిపివేత | Sakshi
Sakshi News home page

ఇటాలియన్ మెరైన్స్పై న్యాయవిచారణ నిలిపివేత

Published Wed, Aug 26 2015 4:12 PM

భారత జాలర్లను కాల్చి చంపిన కేసులో నిందితులైన ఇద్దరు ఇటలీ మెరైన్లు వీళ్లే. - Sakshi

న్యూఢిల్లీ: ఇటాలియన్ మెరైన్స్ ఇద్దరు భారత మత్స్యకారులను కాల్చిచంపిన కేసు మరో మలుపు తిరిగింది. నిందితులకు సంబంధించిన నేర విచారణ ప్రక్రయలన్నింటినీ భారత అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది.

 

ఇటాలియన్ మెరైన్స్ను శిక్షించే హక్కు భారత్కు లేదని, కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సెప్టెంబర్ 24లోగా తనకు సమర్పించాలని యూనైటెడ్ నేషన్స్ ట్రిబ్యునల్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిలిపివేత జనవరి 13 వరేకేనని కోర్టు పేర్కొంది.


అసలేం జరిగింది?
2012 ఫిబ్రవరిలో ఇటలీకి చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ షిప్.. సింగపూర్ నుంచి ఈజిప్ట్ బయలుదేరింది. కేరళ తీరంలో తమ నౌకకు సమీపంగా వచ్చిన ఇద్దరు భారతీయ జాలర్లను ఇటలీ నావికులు విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఆ సమయంలో జాలర్ల వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. విషయం తెలుసుకున్న కేరళ పోలీసులు.. ఇటాలియన్ మెరైన్స్ పై ఐపిసీ 302 కింద కేసు నమోదుచేశారు.

భారత ప్రభుత్వం కూడా వారిని లీగల్‌గా ప్రాసిక్యూట్‌ చెయ్యాలని నిర్ణయించింది. అయితే భారత్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇటలీ నౌకాదళం.. అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. మూడేళ్ల విచారణ అనంతరం నిందితులను శిక్షించే అధికారం మన దేశానికి లేదని ఐక్యరాజ్య సమితి కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయవిచారణను నిలిపివేసినట్లు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement