బాబాయ్ ఇంటికి వెళ్లిన అబ్బాయ్ | Politics is not a game, it is a serious business, says Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

బాబాయ్ ఇంటికి వెళ్లిన అబ్బాయ్

Sep 17 2016 3:28 PM | Updated on Sep 4 2017 1:53 PM

బాబాయ్ ఇంటికి వెళ్లిన అబ్బాయ్

బాబాయ్ ఇంటికి వెళ్లిన అబ్బాయ్

సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ కుటుంబంలో ఏర్పడిన వివాదం టీ కప్పులో తుఫాన్లా సమసిపోయింది.

లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ కుటుంబంలో ఏర్పడిన వివాదం టీ కప్పులో తుఫాన్లా సమసిపోయింది. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్.. యూపీ సమాజ్వాదీ పార్టీ చీఫ్గా నియమితులైన బాబాయ్, యూపీ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ను అభినందించారు. అఖిలేష్ స్వయంగా శివపాల్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. అనంతరం అఖిలేష్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో విబేధాల్లేవని, తామందరం ఒక్కటేనని చెప్పారు.  రాజకీయాలంటే ఆటలు కాదని, సీరియస్ విషయమని అన్నారు.

యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై అఖిలేష్ వేటువేయడంతో అబ్బాయ్, బాబాయ్ మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ములయాం జోక‍్యం చేసుకుని పలుమార్లు కొడుకు అఖిలేష్, తమ్ముడు శివపాల్తో చర్చించి సమస్యను పరిష్కరించారు. మంత్రి పదవికి శివపాల్ చేసిన రాజీనామాను అఖిలేష్ తిరస్కరించడంతో పాటు ఆయన్నుంచి వెనక్కు తీసుకున్న శాఖలను మళ్లీ అప్పగిస్తున్నట్ట ప్రకటించారు. అలాగే ములయాంకు సన్నిహితుడైన ప్రజాపతిని మళ్లీ కేబినెట్లోకి తీసుకున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement