జర్నలిస్టులను.. తగలబెట్టేయబోయారు! | petrol pump staff try to burn four scribes alive | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులను.. తగలబెట్టేయబోయారు!

Dec 24 2016 8:09 AM | Updated on Sep 3 2019 9:06 PM

జర్నలిస్టులను.. తగలబెట్టేయబోయారు! - Sakshi

జర్నలిస్టులను.. తగలబెట్టేయబోయారు!

ఒక హిందీ పత్రికలో పనిచేస్తున్న నలుగురు జర్నలిస్టులపై పెట్రోలు బంకు సిబ్బంది దాడి చేసి, వారిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.

ఒక హిందీ పత్రికలో పనిచేస్తున్న నలుగురు జర్నలిస్టులపై పెట్రోలు బంకు సిబ్బంది దాడి చేసి, వారిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జరిగింది. వాళ్ల దాడితో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన జర్నలిస్టులు.. అక్కడకు దగ్గర్లోనే ఉన్న తమ కార్యాలయంలో దాక్కున్నారు. అయినా, దాడి చేసిన వాళ్లు మళ్లీ అక్కడకు కూడా వచ్చి వారిని, మిగిలిన సిబ్బందిని కూడా తీవ్రంగా కొట్టారు. తర్వాత ఎవరో పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి అందరినీ కాపాడారు. 
 
తాము సివిల్ లైన్స్ ఏరియాలోని పెట్రోలు బంకుకు వెళ్లి రూ. 200కు పెట్రోలు పోయించుకున్నామని, వాళ్లకు పది రూపాయల నాణేలు 20 ఇచ్చామని బాధిత జర్నలిస్టులలో ఒకరైన కృష్ణకాంత్ గుప్తా తెలిపారు. అయితే బంకు సిబ్బంది మాత్రం తమకు నాణేలు వద్దని, నోట్లు ఇవ్వాలని అడిగారు. పది రూపాయల నాణేలు చెల్లుతున్నప్పుడు వాటిని ఎందుకు తీసుకోరని జర్నలిస్టులు వాళ్లను ప్రశ్నించగా.. పెట్రోలు బంకు సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన చూసి దగ్గర్లోనే ఉన్న మరో ఇద్దరు అక్కడకు రాగా, మొత్తం నలుగురిపై బంకు సిబ్బంది పెట్రోలు పోసి, తమను సజీవంగా దహనం చేయడానికి ప్రయత్నించారని కృష్ణకాంత్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement