హైదరాబాద్‌ కలెక్టర్‌గా యోగితా రాణా | Nizamabad collector Yogita Rana transferred to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ కలెక్టర్‌గా యోగితా రాణా

Aug 16 2017 1:53 PM | Updated on Oct 17 2018 6:06 PM

హైదరాబాద్‌ కలెక్టర్‌గా యోగితా రాణా - Sakshi

హైదరాబాద్‌ కలెక్టర్‌గా యోగితా రాణా

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను హైదరాబాద్‌ కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

- నిజామాబాద్‌ నుంచి బదిలీ.. జేసీకి అదనపు బాధ్యతలు
హైదరాబాద్‌:
నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను హైదరాబాద్‌ కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌(జేసీ) రవీందర్‌ రెడ్డికి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కేటాయించారు.

హైదరాబాద్‌ కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్‌ బొజ్జా.. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జేసీ ప్రశాంతి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. మూడు నెలల తర్వాత హైదరాబాద్‌ జిల్లాకు పూర్తి స్థాయి కలెక్టర్‌గను నయమించారు. కాగా, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో యోగితా రాణా బదిలీ అవుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుతుండటం గమనార్హం.

సమర్థురాలైన అధికారణిగా పేరు పొందిన యోగితా.. ఈ-నామ్‌ అమలులో జాతీయ స్థాయి పురస్కారం దక్కించుకున్నారు. గత సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా ప్రధాని మోదీ నుంచి ఆమె విశిష్టసేవ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement