'త్వరలో ఇంటికెళ్ల బోయే కాంగ్రెస్‌.. నీచ రాజకీయాలు' | naresh gujral takes on congress | Sakshi
Sakshi News home page

'త్వరలో ఇంటికెళ్ల బోయే కాంగ్రెస్‌.. నీచ రాజకీయాలు'

Feb 20 2014 7:09 PM | Updated on Aug 18 2018 4:13 PM

రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నివిభజిస్తూ తెలుగు ప్రజలతో ఆడుకుంటున్నారని శిరోమణి అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

న్యూఢిల్లీ: రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నివిభజిస్తూ తెలుగు ప్రజలతో ఆడుకుంటున్నారని శిరోమణి అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బిల్లులో ప్రభుత్వం శుష్క వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టడానికి యత్నిస్తోందన్నారు. బిల్లు తీరు చూస్తే ఏపీలో హింస పొంచి ఉన్న సూచనలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. చండీగఢ్‌ ఐదేళ్ల రాజధాని గా నిర్ణయించిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసినవేనని గుజ్రాల్ అన్నారు.

 

కొన్నిరోజుల్లో ఇంటికెళ్ల బోయే కాంగ్రెస్‌.. నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రేపు అటార్నీ జనరల్ ను సభకు పిలవాలని ఆయన డిప్యూటీ స్పీకర్ కురియన్ కు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement