breaking news
Naresh gujral
-
'జిల్లాలకు ప్రత్యేక హోదా ఇవ్వండి'
-
'జిల్లాలకు ప్రత్యేక హోదా ఇవ్వండి'
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కాదు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని శిరోమణి అకాలీదళ్ ఎంపీ నరేశ్ గుజ్రాల్ సూచించారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని ప్రాంతాలకే మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని అన్నారు. ఆంధప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో శుక్రవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తర్వాత చర్చకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని వైస్ చైర్మన్ పీజే కురియన్ విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ సభ్యులే చర్చను అడ్డుకుంటే ఎలా అని టీడీపీ ఎంపీలను ఉద్దేశించి అన్నారు. సభ్యులు శాంతిచడంతో అరుణ్ జైట్లీ తన ప్రసంగం కొనసాగించారు. -
'త్వరలో ఇంటికెళ్ల బోయే కాంగ్రెస్.. నీచ రాజకీయాలు'
న్యూఢిల్లీ: రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నివిభజిస్తూ తెలుగు ప్రజలతో ఆడుకుంటున్నారని శిరోమణి అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బిల్లులో ప్రభుత్వం శుష్క వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టడానికి యత్నిస్తోందన్నారు. బిల్లు తీరు చూస్తే ఏపీలో హింస పొంచి ఉన్న సూచనలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. చండీగఢ్ ఐదేళ్ల రాజధాని గా నిర్ణయించిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసినవేనని గుజ్రాల్ అన్నారు. కొన్నిరోజుల్లో ఇంటికెళ్ల బోయే కాంగ్రెస్.. నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రేపు అటార్నీ జనరల్ ను సభకు పిలవాలని ఆయన డిప్యూటీ స్పీకర్ కురియన్ కు విజ్ఞప్తి చేశారు. -
‘ఆపరేషన్ బ్లూస్టార్’లో కొత్త కోణాలు!
లండన్/న్యూఢిల్లీ/ఛండీగఢ్: పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన ఖలిస్థాన్ తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు ఇందిరాగాంధీ హయాంలో 1984లో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఈ విషయంలో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీకి సలహా ఇచ్చేందుకు బ్రిటన్కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్(ఎస్ఏఎస్) అధికారి ఒకరిని పంపేందుకు నాటి బ్రిటన్ ప్రధానమంత్రి మార్గరేట్ థాచర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వెలువడిన వార్తలు రెండు దేశాల్లోనూ కలకలం సృష్టించాయి. దీంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అత్యవసర దర్యాప్తునకు బుధవారం ఆదేశించారు. ఇందులో బ్రిటన్ జోక్యానికి సంబంధించి ఇంకా సాక్ష్యాలేవీ లభించకున్నా, ఈ ఉదంతంపై, అత్యంత సున్నితమైన ప్రభుత్వ పత్రాల విడుదలపై దర్యాప్తునకు ఆదేశించారు. ఇదీ విషయం..: స్వర్ణదేవాలయంలో తిష్టవేసిన ఖలిస్థాన్ తీవ్రవాదులను ఏరివేసేందుకు 1984లో ఇందిరాగాంధీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ సందర్భంగా సైన్యం జరిపిన దాడిలో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం, చివరికది ఇందిర హత్యకు దారి తీయడం తెలిసిందే. తీవ్రవాదుల ఏరివేతకు సలహా ఇవ్వాలని నాటి థాచర్ ప్రభుత్వాన్ని ఇందిర నాలుగు నెలల ముందే కోరినట్టు లండన్లోని నేషనల్ ఆర్కైవ్స్ విడుదల చేసిన పత్రాలు స్పష్టం చేశాయి. ‘ఎస్ఏఎస్ అధికారిని భారత్కు పంపగా ఆయన దాడి ప్రణాళికను రూపొందించారు. దాన్ని ఇందిర ఆమోదించారు’ అని వాటి ద్వారా వెల్లడైంది. దీనిపై అకాలీదళ్, బీజేపీ తీవ్రంగా స్పందించాయి. అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్ బుధవారం ఛండీగఢ్లో మాట్లాడుతూ.. సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఈ వ్యవహారం బహిర్గతం చేస్తోందన్నారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఇది స్పష్టం చేస్తోందన్నారు. వాస్తవాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఢిల్లీలో కోరారు.