ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు చేదు అనుభవం | Nandigama mla tangirala sowmya faces bitter experience in Eruvaka programme | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు చేదు అనుభవం

Jun 20 2016 4:47 PM | Updated on Oct 1 2018 2:00 PM

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు చేదు అనుభవం - Sakshi

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు చేదు అనుభవం

కృష్ణాజిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది.

విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామ ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్యకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది.  కంచికచర్లలో ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమానికి రైతులు ఎవరూ హాజరు కాకపోవటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రైతులు ఎందుకు రాలేదంటూ ఎమ్మెల్యే సౌమ్య ఈ సందర్భంగా అధికారులను నిలదీశారు. అయితే వారి వద్ద నుంచి సరైన సమాధానం లభించలేదు.

దీంతో రైతులు లేని ఏరువాక ఎందుకంటూ ఆమె వెనుతిరిగి వెళ్లిపోయారు. కాగా వర్షాకాలం ప్రారంభం కావటంతో ఏపీ ప్రభుత్వం ఇవాళ ఏరువాక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.  ఈ ఏరువాక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం కమిటీలు కూడా వేసింది. అయితే చాలా ప్రాంతాల్లో ఏరువాక కార్యక్రమానికి స్పందన కరువైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement