ఐటీ రంగ వృద్ధికి మరిన్ని చర్యలు | More concentration on IT sector growth | Sakshi
Sakshi News home page

ఐటీ రంగ వృద్ధికి మరిన్ని చర్యలు

Jan 5 2014 1:47 AM | Updated on Sep 2 2017 2:17 AM

ఐటీ రంగ వృద్ధికి మరిన్ని చర్యలు

ఐటీ రంగ వృద్ధికి మరిన్ని చర్యలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశం అసాధారణ వృద్ధి సాధించిందని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు.

 తిరువనంతపురం: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశం అసాధారణ వృద్ధి సాధించిందని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈ రంగం మరింత పురోగమించేందుకు సానుకూల పరిస్థితులు కల్పించేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. శనివారం తిరువనంతపురంలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గ్లోబల్ లెర్నింగ్ సెంటర్‌కి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు చెప్పారు.

గడిచిన ఇరవై ఏళ్లుగా భారత ప్రైవేట్‌రంగ కంపెనీలు సాధిస్తున్న విజయగాథలకు టీసీఎస్ చక్కని ఉదాహరణ అని మన్మోహన్ సింగ్ కితాబిచ్చారు. మరోవైపు పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ సుమారు రూ. 4,500 కోట్లతో కేరళలోని పుథైవైపిలో నిర్మించిన ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement