బ్లాక్‌బెర్రీ మొబైల్కు 16 పట్టణాల సమాచారం | Mobile application for Tourists | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బెర్రీ మొబైల్కు 16 పట్టణాల సమాచారం

Jun 28 2014 8:53 PM | Updated on Apr 3 2019 4:37 PM

బ్లాక్‌బెర్రీ మొబైల్కు 16 పట్టణాల సమాచారం - Sakshi

బ్లాక్‌బెర్రీ మొబైల్కు 16 పట్టణాల సమాచారం

మరొకరి సాయం లేకుండా దేశవ్యాప్తంగా 16 పట్టణాలలో సొంతంగానే పర్యటించేందుకు ఉపకరించే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసింది.

 న్యూఢిల్లీ: మరొకరి సాయం లేకుండా దేశవ్యాప్తంగా 16 పట్టణాలలో సొంతంగానే పర్యటించేందుకు ఉపకరించే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసింది. జెనెసిస్ ఇంటర్నేషనల్ సహకారంతో ‘ఇంక్రెడిబుల్ ఇండియా వాకింగ్ టూర్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ అప్లికేషన్‌లో హైదరాబాద్, చెన్నై, జైపూర్, గోవా, బెంగళూరు, ముంబై సహా 16 పట్టణాల సమాచారం ఉంటుందని పర్యాటక శాఖ వెల్లడించింది.

నిపుణుల బందం ఈ సమాచారాన్ని పొందుపరిచిందని, ఈ అప్లికేషన్ ద్వారా పట్టణాల్లోని వీధులను 360 డిగ్రీల కోణంలో ఆమూలాగ్రం చూడవచ్చని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాదనాయక్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది బ్లాక్‌బెర్రీ మొబైల్స్ కోసమే అందుబాటులో ఉంది.  త్వరలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement