రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో మంత్రి గీతారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో మంత్రి గీతారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ పది జిల్లాల తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. రాష్ట్రపతి నుంచి త్వరలోనే అసెంబ్లీకి బిల్లు వస్తుందని గీతారెడ్డి అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాకుంటే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అయినా బిల్లుకు ఆమోదం తెలపాలని ఆమె అభిప్రాయపడ్డారు.