7న పులిచింతల ప్రారంభం

7న పులిచింతల ప్రారంభం - Sakshi


సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఒకటైన పులిచింతల ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 7న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టు డ్యామ్‌ను ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం జడపల్లితండాలోని పులిచింతల డ్యామ్ వద్ద ఉదయం 11:50 గంటలకు ప్రారంభ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

 

  కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజీ కెపాసిటీ 36.23 టీఎంసీలు. డ్యామ్ వద్ద 3.61 టీఎంసీల నీటి నిల్వ సామర ్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. 2014 జూన్‌లో మొదటి విడతగా ఖరీఫ్ పంటకు నీరందించేందుకు వీలుగా 15 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top