ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మ పండుగ కానుక | Jaya announces bonus worth Rs 476 cr for state PSU employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మ పండుగ కానుక

Sep 28 2016 4:16 PM | Updated on Jun 4 2019 6:19 PM

ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మ పండుగ కానుక - Sakshi

ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మ పండుగ కానుక

రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జయలిలత వివిధ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల 3.67 లక్షల మంది ఉద్యోగులకు రూ 476,71 కోట్ల రూపాయల మేర బోనస్ ప్రకటించారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం   తన ఉద్యోగులకు  పండుగ బోనస్  ప్రకటించింది.  రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని   ముఖ్యమంత్రి జయలిలత  వివిధ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల  ఉద్యోగులకు  బుధవారం ఈ తీపికబురు అందించారు.  3.67 లక్షల మంది అర్హతగల ఉద్యోగులకు రూ 476,71 కోట్ల రూపాయల మేర బోనస్ ప్రకటించారు. 2015-16  ఆర్థిక సంవత్సరానికి  కనీసం రూ 8,400  గరిష్టంగా రూ 16,800  వరకు బోనస్ చెల్లించనున్నట్టు  ముఖ్యమంత్రి కార్యాలయం  విడుదల చేసిన  ఒక పత్రికా ప్రకటనలో  చెప్పారు.
అలాగే  బోనస్ పథకం కిందికి రాని  కో-ఆపరేటివ్ సొసైటీస్  తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులకు రూ .4,000 బోనస్  పౌర సరఫరాల కార్పొరేషన్ తాత్కాలిక కార్మికులకు  రూ 3,000 ఇవ్వనున్నట్టు జయలలిత  ప్రకటించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement