కీలకమైన జీడీపీ గణాంకాలు వచ్చేశాయ్! | India's GDP grows 7.3% in September quarter | Sakshi
Sakshi News home page

కీలకమైన జీడీపీ గణాంకాలు వచ్చేశాయ్!

Nov 30 2016 6:06 PM | Updated on Sep 4 2017 9:32 PM

పెద్ద నోట్ల రద్దు వల్ల వృద్ధి రేటుపై పోటు పడుతుందని పలు రేటింగ్ సంస్థలు అంచనావేస్తున్న నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జీడీపీ ఫలితాలు నేడు విడుదలయ్యాయి.

పెద్ద నోట్ల రద్దు వల్ల వృద్ధి రేటుపై పోటు పడుతుందని పలు రేటింగ్ సంస్థలు అంచనావేస్తున్న నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జీడీపీ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. మార్కెట్ వర్గాలకు శుభసూచికగా జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో జీడీపీ రేటు 7.3 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. గత క్వార్టర్లో ఈ రేటు 7.1 శాతంగా ఉంది. గత త్రైమాసికం కంటే ఈ త్రైమాసికంలో దేశీయ ఎకానమీ శరవేగంగా వృద్ధి చెందినట్టు ఈ గణాంకాల్లో తెలిసింది. అదేవిధంగా ఈ రేటు పెంపుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీలో భారత్ ఒకటిగా మరోసారి రుజువు చేసుకుంది. కానీ నవంబర్ 9 నుంచి హఠాత్తుగా రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్ల వల్ల దేశమంతటా నగదు సమస్య ఏర్పడిందని, ఇది వచ్చే నెలల్లో వృద్ధిరేటు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులంటున్నారు. 
 
ఈ ఆర్థికసంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటును అత్యధికంగా 8 శాతం నమోదుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ హఠాత్తుగా పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడంతో సమీప కాలంలో వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుందని పలు రేటింగ్ సంస్థలు సైతం అంచనావేస్తున్నాయి. 2017-18 ఆర్థికసంవత్సర వృద్ధి రేటు అంచనాలను కుదిస్తూ వస్తున్నాయి. కరెన్సీరద్దు స్వల్పకాలంలో ప్రభావం చూపినా.. దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని అవి పేర్కొంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement