జర్నలిస్టులకు భారత్ ఆసియాలోనే అత్యంత ప్రమాదకర దేశమని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్‌ఎస్‌ఎఫ్) తెలిపింది.
లండన్: జర్నలిస్టులకు భారత్ ఆసియాలోనే అత్యంత ప్రమాదకర దేశమని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్‌ఎస్‌ఎఫ్) తెలిపింది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 110 మంది పాత్రికేయులు అసహజంగా చనిపోగా, వారిలో 9 మంది భారతీయులేనని వార్షిక నివేదికలో పేర్కొంది. వీరిలో రాజకీయ నేతలతో సంబంధాలున్న అక్రమ మైనింగ్, నేరాల వార్తలు అందిస్తూ హత్యకు గురైనవారు ఐదుగురు కాగా, మిగిలినవారు ఇతర కారణాలతో హత్యకు గురయ్యారు. పాక్, ఆఫ్ఘన్‌కంటే భారతే జర్నలిస్టులకు ప్రమాదకరమని పేర్కొంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా 67 మంది పాత్రికేయులు విధి నిర్వహణలో హత్యకు గురయ్యారని, మిగతా వారు ఇతర కారణాలతో చనిపోయారంది. ఇరాక్‌లో అత్యధికంగా 11 మంది హత్యకు గురయ్యారని వెల్లడించింది.