మూడోవారంలోనూ తగ్గిన పుత్తడి | Sakshi
Sakshi News home page

మూడోవారంలోనూ తగ్గిన పుత్తడి

Published Mon, Jun 8 2015 6:10 AM

మూడోవారంలోనూ తగ్గిన పుత్తడి - Sakshi

ప్రపంచ ట్రెండ్ ప్రభావం
అంతర్జాతీయ ధరలు బలహీనంగా ఉండటంతో దేశీయంగా బంగారం ధరలు గతవారం క్షీణించాయి. దీంతో పుత్తడి ధర వరుసగా మూడోవారం కూడా తగ్గినట్లయ్యింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ. 27,000లోపునకు తగ్గింది. 99.9 స్వచ్ఛతగల పుత్తడి రూ. 26,950 వద్దకు, 99.5 స్వచ్ఛతగల బంగారం రూ. 26,800 వద్దకు తగ్గింది. ఈ రెండూ అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 380 మేర తగ్గాయి. దేశీయంగా ఈ ధర 6 వారాల కనిష్టం. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలకు బలం చేకూరడంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,168 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇది 11 వారాల కనిష్టం.

Advertisement

తప్పక చదవండి

Advertisement