అర్ధ రాష్ట్రానికి నేను పావు సీఎంను! | i am 1/4 cm of half state delhi, says arvind kejriwal | Sakshi
Sakshi News home page

అర్ధ రాష్ట్రానికి నేను పావు సీఎంను!

Jun 25 2016 2:37 PM | Updated on Mar 29 2019 9:31 PM

అర్ధ రాష్ట్రానికి నేను పావు సీఎంను! - Sakshi

అర్ధ రాష్ట్రానికి నేను పావు సీఎంను!

ఢిల్లీని అర్ధ రాష్ట్రమని అంటారు. ఆ అర్ధరాజ్యానికి నేను పావు ముఖ్యమంత్రినని చెప్తారు.

న్యూఢిల్లీ: 'ఢిల్లీని అర్ధ రాష్ట్రమని అంటారు. ఆ అర్ధరాజ్యానికి నేను పావు ముఖ్యమంత్రినని చెప్తారు. మరీ రాత్రంతా వాళ్లకు మేము కలలోకి వచ్చినట్టు మమ్మల్ని చూసి అంత భయపడతారెందుకో' అంటూ బీజేపీ మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ పార్టీ ఆప్ ఎమ్మెల్యేను విలేకరుల సమావేశంలో అరెస్టు చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశాల్లో ఉన్నంతకాలం ఢిల్లీ బాగానే ఉంటుందని, ఆయన స్వదేశానికి రాగానే ఢిల్లీలో అలజడి మొదలువుతున్నదని మండిపడ్డారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను బెదిరించడం, భయాందోళనలకు గురిచేయడం, వారిపై తప్పుడు కేసులు మోపడం ద్వారా హస్తినలో ప్రధాని మోదీ అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించారని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement