హెచ్‌యూఎల్ లాభం రూ. 962 కోట్లు | HUL profit of Rs. 962 crore | Sakshi
Sakshi News home page

హెచ్‌యూఎల్ లాభం రూ. 962 కోట్లు

Oct 15 2015 12:33 AM | Updated on Sep 3 2017 10:57 AM

హెచ్‌యూఎల్ లాభం రూ. 962 కోట్లు

హెచ్‌యూఎల్ లాభం రూ. 962 కోట్లు

హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) కంపెనీ నికర లాభం(స్టాండ్‌ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 3 ....

క్యూ2లో 3% తగ్గుదల ఒక్కో షేర్‌కు రూ. 6.5 డివిడెండ్

న్యూఢిల్లీ: హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) కంపెనీ నికర లాభం(స్టాండ్‌ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 3 శాతం తగ్గింది. ఎక్సైజ్ సుంకం రాయితీల కాలపరిమితి తీరిపోవడం, ధరల తగ్గింపు కారణాల వల్ల నికర లాభం తగ్గిందని హిందూస్తాన్ యూనిలీవర్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.988 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ2లో రూ.962 కోట్లకు తగ్గిందని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు.  నికర అమ్మకాలు మాత్రం రూ.7,466 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.7,820 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. వ్యయాలు రూ.6,474 కోట్ల నుంచి 4 శాతం పెరిగి రూ.6,706 కోట్లకు. పన్ను వ్యయాలు 7 శాతం పెరిగి రూ.446 కోట్లకు చేరాయని చెప్పారు.

ముడి పదార్థాల ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకు ధరలు తగ్గించామని  వివరించారు. తక్కువ ధరల్లో ముడి పదార్థాలు లభించడం కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నామని, హెచ్‌యూఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిబి. బాలాజి చెప్పారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్లలో తమ నికరలాభం(స్టాండ్‌ఎలోన్) 1 శాతం తగ్గి రూ.2,021 కోట్లకు పడిపోగా, నికర అమ్మకాలు మాత్రం 5 శాతం వృద్ధితో రూ.15,793 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేర్ బీఎస్‌ఈలో 1.8 శాతం క్షీణించి రూ.797 వద్ద ముగిసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement