తిరుమలలో శ్రీవారి గరుడసేవకు ఆదివారం భక్తులు పోటెత్తారు.
తిరుమల: తిరుమలలో శ్రీవారి గరుడసేవకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. రామ్ బగిచ అతిధి గృహం వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భక్తులు బారీకేడ్లను విరగ్గొట్టి తిరుమాడ వీధుల్లోకి ప్రవేశించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారిని అదుపు చేయడానికి సిబ్బంది, పోలీసులు శ్రమించారు.