ప్రమోటర్ల చేతులు మారిన జీవీకే పవర్ షేర్లు | gvk power shares promoter hands were changed | Sakshi
Sakshi News home page

ప్రమోటర్ల చేతులు మారిన జీవీకే పవర్ షేర్లు

Mar 24 2015 1:07 AM | Updated on Sep 2 2017 11:16 PM

ప్రమోటర్ల చేతులు మారిన జీవీకే పవర్ షేర్లు

ప్రమోటర్ల చేతులు మారిన జీవీకే పవర్ షేర్లు

జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాకు చెందిన వ్యక్తిగత ప్రమోటర్లు, ప్రమోటింగ్ కంపెనీల మధ్య షేర్లు చేతులు మారాయి.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాకు చెందిన వ్యక్తిగత ప్రమోటర్లు, ప్రమోటింగ్ కంపెనీల మధ్య షేర్లు చేతులు మారాయి. అంతర్గత బదిలీ లావాదేవీల తర్వాత జీవీకే పవర్‌లో ప్రమోటింగ్ కంపెనీ వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ వాటా 23.35 శాతం నుంచి 8.91 శాతానికి తగ్గింది.

ఇదే సమయంలో జి. ఇందిరా కృష్ణారెడ్డి వాటా 8.34 శాతం నుంచి 14.59 శాతానికి పెరిగితే, జి. అపర్ణా రెడ్డి వాటా 0.40 శాతం నుంచి 4.79 శాతానికి, షాలినీ భూపాల్ వాటా 0.40 శాతం నుంచి 3.74 శాతానికి పెరిగింది. అలాగే మరో ప్రమోటింగ్ కంపెనీ గ్రీన్‌రిడ్జ్ హోటల్స్ వాటా సున్నా నుంచి 0.46 శాతానికి చేరింది. తాజ్ జీవీకే హోటల్స్ లిమిటెడ్‌లో 14.29 శాతం వాటా కలిగిన ప్రమోటర్ షాలినీ భూపాల్ తన వాటాను 0.68 శాతానికి తగ్గించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement