రామోజీకి పద్మవిభూషణ్ ఎలా ఇస్తారు? | Former MP Undavalli Arun Kumar comments on ramoji rao | Sakshi
Sakshi News home page

రామోజీకి పద్మవిభూషణ్ ఎలా ఇస్తారు?

Feb 12 2016 3:05 AM | Updated on Oct 3 2018 7:42 PM

రామోజీకి పద్మవిభూషణ్ ఎలా ఇస్తారు? - Sakshi

రామోజీకి పద్మవిభూషణ్ ఎలా ఇస్తారు?

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై అనేక కేసులున్నాయని, అలాంటి వ్యక్తికి పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డును ఎలా ప్రకటిస్తారని...

కేంద్రానికి మాజీ ఎంపీ ఉండవల్లి ప్రశ్న
హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై అనేక కేసులున్నాయని, అలాంటి వ్యక్తికి పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డును ఎలా ప్రకటిస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. పద్మవిభూషణ్ వంటి అవార్డులను ప్రకటించేముందు సదరు వ్యక్తుల నేరచరిత గురించి ప్రభుత్వం కచ్చితంగా తెలుసుకుని ఉండాలన్నారు. ‘రామోజీరావు పద్మవిభూషణ్’ అని ఇంటర్నెట్‌లో సెర్చ్‌చేస్తే ఆయనపైనున్న కే సులన్నీ బయటపడతాయన్నారు.

రామోజీరావుపైనున్న కేసుల వివరాల్ని త్వరలోనే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి అందజేయనున్నట్లు తెలిపారు.  ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.  జర్నలిజం, సాహిత్యం, విద్య విభాగాల్లో రాణించినందుకుగాను పద్మవిభూషణ్ ఇస్తున్నట్లు ప్రకటించారని ఏ పుస్తకాలు రాశారని లిటరేచర్ విభాగంలో అవార్డు ప్రకటించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement