వేధింపుల కేసులో ఐదుగురికి మూడేళ్ల జైలు | Five youngsters to sentenced three years jail by harrasments of young girl | Sakshi
Sakshi News home page

వేధింపుల కేసులో ఐదుగురికి మూడేళ్ల జైలు

Aug 13 2015 8:59 PM | Updated on Apr 4 2019 5:20 PM

యువతితో అసభ్యంగా మాట్లాడటంతో పాటు.. మానసికంగా వేధించిన కేసులో ఐదుగురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ.. నందికోట్కూరు జేఎస్‌ఎమ్ మెజిస్ట్రేట్ తీర్పు నిచ్చారు.

పగిడాల(కర్నూలు): యువతితో అసభ్యంగా మాట్లాడటంతో పాటు.. మానసికంగా వేధించిన కేసులో ఐదుగురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ.. నందికోట్కూరు జేఎస్‌ఎమ్ మెజిస్ట్రేట్ తీర్పు నిచ్చారు. వివరాలు.. వెస్ట్ ప్రాతకోటకు చెందిన యువతి(22)ని అదే ప్రాంతానికి చెందిన 5గురు యువకులు వేధింపులకు గురిచేసేవారు.

తరచు వెంట పడుతూ.. తమ కోరిక తీర్చాలని ఇబ్బంది పెట్టేవారు. ఈ వేధింపులతో విసిగిపోయిన యువతి.. 2013లో ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు అనంతరం ఈ రోజు న్యాయమూర్తి ఐదుగురు నిందితులకు మూడేళ్ల జైలు, రూ. 4 వేల జరిమన విధిస్తూ.. తీర్పునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement