హైటెన్షన్‌ వైర్లు తగలడంతో.. గగుర్పోడిచే దృశ్యాలు | five dead after shocke by a high tension wire | Sakshi
Sakshi News home page

హైటెన్షన్‌ వైర్లు తగలడంతో.. గగుర్పోడిచే దృశ్యాలు

Oct 29 2016 10:53 AM | Updated on Sep 4 2017 6:41 PM

హైటెన్షన్‌ వైర్లు తగలడంతో.. గగుర్పోడిచే దృశ్యాలు

హైటెన్షన్‌ వైర్లు తగలడంతో.. గగుర్పోడిచే దృశ్యాలు

శుక్రవారం రాత్రి హైటెన్షన్‌ వైర్లు బీభత్సాన్ని సృష్టించాయి. రాత్రి వేళ పార్టీలో మునిగితేలుతున్న వారిపై ఒక్కసారిగా హైటెన్షన్‌ వైర్లు పడటం..

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో శుక్రవారం రాత్రి హైటెన్షన్‌ వైర్లు బీభత్సాన్ని సృష్టించాయి. ఓ ఫార్మ్‌హౌస్‌లో పార్టీ జరుగుతుండగా హైటెన్షన్‌ వైర్ల వల్ల షాక్‌ తగిలి ఐదుగురు వ్యక్తులు సంఘటనాస్థలంలోనే కాలిబూడిదయ్యారు. ఫార్మ్‌హౌస్‌ నుంచి ఐదుగురు వెయిటర్లు తందూరి పొయ్యిని బయటకు తెస్తుండగా.. దాని ఇనుపచువ్వ  హైవోల్టేజ్‌ విద్యుత్‌ ప్రవహించే వైర్లకు తాకింది. దీంతో తీవ్రస్థాయి షాక్‌ గురైన ఆ ఐదుగురు కనీసం అవశేషాలు కూడా మిగలకుండా అత్యంత భయానకంగా ప్రాణాలు విడిచారు. సంఘటనా స్థలంలో వారు ప్రాణాలు విడిచిన చోట.. కేవలం వారి ఆకారాల్లో భస్మమైన బూడిద మాత్రమే మిగిలి ఉండటం.. ఈ ఘటనను చూసిన వారిని దిగ్భ్రాంతపరుస్తున్నది. సంఘటనాస్థలంలో ఐదుగురి మృతికి సంబంధించి గగుర్పొడిచే ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఐదుగురు వెయిటర్లు చనిపోగా.. ముగ్గురి మృతదేహాలను మాత్రమే అవశేషాల ఆధారంగా ఇప్పటివరకు గుర్తించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement