ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న భువనేశ్వర్ - రాజధాని ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న భువనేశ్వర్ - రాజధాని ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్లో చెలరేగిన ఈ మంటలు ఇతర బోగీలకు వ్యాపించాయి. సుమారు ఆరు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అలాగే పక్కనే నిలిచి ఉన్న మరో రైలుకు కూడా మంటలు వ్యాపించాయి.
రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. స్టేషన్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఏసీ కోచ్లో ప్రయాణీకులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు 16 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.