నందవరం మండలం గురజాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమంతు(40) అనే రైతు మృతిచెందాడు.
కర్నూలు(నందవరం): నందవరం మండలం గురజాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమంతు(40) అనే రైతు మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో చోటుచేసుకుంది. హనుమంతుతో పాటు మరో రైతు పుల్లయ్య పొలానికి నీళ్లు పెట్టడానికి రాత్రి వెళ్లారు.
నీళ్లు పెడుతూ కాపలాగా రోడ్డు పక్కనే నిద్రించారు. రోడ్డుపై పడుకున్న హనుమంతుపై నుంచి గుర్తుతెలియని వాహనం వెళ్లటంతో హనుమంతు శరీరం నుజ్జునుజ్జయింది. పుల్లయ్యకు ఎటువంటి గాయాలు కాలేదు.