మోడల్ పై అత్యాచారం
ఫేస్‌బుక్‌లో పరిచయమైన విద్యార్థినికి మోడలింగ్ రంగంలోఅవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, లోబర్చుకొని లైంగిక దాడులకు పాల్పడ్డాడు ఓ మృగాడు.
బనశంకరి (బెంగళూరు): ఫేస్‌బుక్‌లో పరిచయమైన విద్యార్థినికి మోడలింగ్ రంగంలోఅవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, లోబర్చుకొని లైంగిక దాడులకు పాల్పడ్డాడు ఓ మృగాడు. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది. ముంబైకి చెందిన ఓ మైనర్ బాలిక (17) బెంగళూరులో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఫ్యాషన్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రగదీశ్ కపూర్ (32) అనే వ్యక్తి ఆ బాలికను ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాడు.
మోడలింగ్‌లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమెకు తెలియకుండా పాలలో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడు. వాటి ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడేవాడు. దీంతో బాధితురాలు రామమూర్తి నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం కపూర్‌ను అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఇతర మోడల్స్ ఫొటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పొస్కో కింద కేసు నమోదు చేశారు.


