పార్టీలో సంస్థాగత ఎన్నికలకు గడువును పొడిగించాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తిని ఈసీ అంగీకరించింది.
న్యూఢిల్లీ: పార్టీలో సంస్థాగత ఎన్నికలకు గడువును మరో 6 నెలలు పొడిగించాలన్న కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్(ఈసీ) అంగీకరించింది. డిసెంబర్ 31లోపు పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి తీరాలని చెప్పింది.
ఈసీ నిర్ణయంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదీ మాట్లాడుతూ ‘ఎన్నికల కమిషన్ మా విజ్ఞప్తిని మన్నించి సంస్థాగత ఎన్నికల గడువును జూన్ 30 నుంచి డిసెంబర్ 31 వరకూ పొడిగించింది’ అని తెలిపారు. తమకు చాలాతక్కువ సమయం మిగిలి ఉన్నందున సంస్థాగత ఎన్నికలకు మరింత సమయం కావాలని కాంగ్రెస్ ఇంతకుముందు ఈసీని కోరింది.