ఓ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థి బుద్ధిగా చదువుకోకుండా పక్కదారిపట్టాడు. ఏకంగా దొంగ అవతారమెత్తాడు.
ఈరోడ్: ఓ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థి బుద్ధిగా చదువుకోకుండా పక్కదారిపట్టాడు. ఏకంగా దొంగ అవతారమెత్తాడు. ఏటీఎమ్ను దోచుకునేందుకు ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు. వివరాలి ఉన్నాయి.
కేరళకు చెందిన 19 ఏళ్ల మహమ్మద్ సాలిఖ్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం తమిళనాడులోని ఈరోడ్ సమీపాన చెన్నిమలైలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎమ్లో డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆనవాళ్లు కనిపించకుండా ఆ సమయంలో మఖానికి గుడ్డ కట్టుకుని, చేతులకు గ్లౌజ్ వేసుకున్నాడు. ఏటీఎమ్ను పగలకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యంకాలేదు. చోరీ యత్నం బెడిసికొట్టగా, అతగాడు పోలీసులకు దొరికొపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్టు ఈరోడ్ ఎస్పీ శిబిచక్రవర్తి తెలిపారు.