వెనక్కు తగ్గిన శ్రీకృష్ణా కాలేజీ | College magazine with anti-Modi remarks withdrawn | Sakshi
Sakshi News home page

వెనక్కు తగ్గిన శ్రీకృష్ణా కాలేజీ

Jun 16 2014 7:50 PM | Updated on Sep 2 2017 8:54 AM

ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక వ్యాఖ్యలపై కేరళలోని శ్రీకృష్ణా కాలేజీ వెనక్కు తగ్గింది.

గురువాయుర్: ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక వ్యాఖ్యలపై కేరళలోని శ్రీకృష్ణా కాలేజీ వెనక్కు తగ్గింది. మోడీకి వ్యతిరేకంగా తమ క్యాంపస్ మేగజీన్ లో ప్రచురించిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అలాగే విద్యార్థులకు, కాలేజీ సిబ్బందికి పంపిణీ చేసిన మేగజీన్ ప్రతులను కూడా వెనక్కు తీసుకోవాలని కాలేజీ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

చట్టపరమైన చర్యలు, బీజేపీ ఆందోళనలకు భయపడి శ్రీకృష్ణా కాలేజీ ఈ మేరకు నిర్ణయించింది. మోడీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు స్టూడెంట్ ఎడిటర్, ప్యానల్ సభ్యులతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బెయిల్ పై విడుదలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement